హైదరాబాద్: టాలీవుడ్లో కొరియోగ్రాఫర్ జానీపై నమోదైన లైంగిక వేధింపుల కేసు చర్చనీయాంశంగా మారింది. నార్సింగి పోలీస్ స్టేషన్కు జానీ మాస్టర్ భార్య వెళ్లింది. జానీపై ఫిర్యాదు చేసిన బాధితురాలు అతని భార్యపై కూడా ఫిర్యాదు చేసింది. దీంతో.. ఆమెకు నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి హాజరుకావాలని కబురందింది. జానీపై పోలీసులు ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేశారు. బాధితురాలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో మహిళా కమిషన్ ఆదేశాలతో బాధితురాలికి సెక్యూరిటీ కల్పించారు. ఐదు రోజులుగా పరారీలో ఉన్న జానీని పోలీసులు ఎట్టకేలకు గోవాలో అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో జానీ మాస్టర్ని హాజరుపరచాలని పోలీసులు నిర్ణయించారు.
Also Read :- నాగబాబు మాటలు ఎవరి గురించి
గోవా కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్ కింద హైదరాబాద్కు జానీని తరలించనున్నారు. లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డు అందుకున్న జానీకి ఈ పరిణామం మాయని మచ్చగా మిగిలిపోయింది. ధనుష్ హీరోగా నటించిన ‘తిరుచిత్రంబళం’ తెలుగులో ‘తిరు’ పేరుతో విడుదలైన సినిమాకు గానూ జానీకి జాతీయ అవార్డు దక్కింది. ఈ సినిమాలోని ‘మేఘం కరిగేనా’ పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు జానీకి నేషనల్ అవార్డ్ వచ్చింది.