
బెల్లంపల్లి రూరల్, వెలుగు: కన్నెపల్లి మండలంలోని జన్కాపూర్రైతు వేదికను ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంగళవారం ప్రారంభించారు. గత ప్రభుత్వంలో బిల్లులు రాక పెండింగ్‌లో ఉండి పూర్తికాని రైతు వేదిక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పూర్తయ్యింది. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే వినోద్.. ఈ వేదికలోనే భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన 37 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
ప్రజలను స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు చోట్ల విద్యుత్సమస్య ఉందని చెప్పడంతో సమస్యను తీర్చాలని ట్రాన్స్‌కో ఏఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎం. నర్సింగరావు, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, సాబీర్ఆలీ, ఎంపీటీసీలు సంతోష్‌కుమార్, హరీశ్‌గౌడ్, వైస్‌ఎంపీపీ రాకేశ్‌శర్మ, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.