
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ప్రత్యక్ష దైవం సూర్యుడికి ప్రతిరోజు ఉదయం అర్ఘ్యం సమర్పిస్తారు. ఇలా చేయడం వలన పుణ్యం లభిస్తుందని ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. రవి వేరే గ్రహంతో కలిసినప్పుడు రవి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం లో పేర్కొన్నారు. ఈ రవి యోగం శుభ యోగంగా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది ( 2023) కృష్ణాష్టమి రోజున రవి( సూర్యుడు) రోహిణి నక్షత్రంలో సంచరిస్తాడని పంచాంగ కర్తలు చెబుతున్నారు. శ్రీకృష్ణుని రోహిణి నక్షత్ర గడియల్లో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి అరుదైన కలయిన 30 ఏళ్లకొకసారి జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
2023 వ సంవత్సరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు నక్షత్రాలు, గ్రహాల అరుదైన కలయిక వల్ల 30 ఏళ్ల తర్వాత రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏకకాలంలో ఏర్పడుతున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈసారి జన్మాష్టమి పండుగ అష్టమి తిథి నాడు సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:37 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా ఈ పండుగ సెప్టెంబర్ 7 సాయంత్రం 4:14 గంటలకు ముగుస్తుంది. ఈసారి శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు నక్షత్రాలు, గ్రహాల అరుదైన కలయిక వల్ల 30 ఏళ్ల తర్వాత రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏకకాలంలో ఏర్పడుతున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
హిందూ పురాణ గ్రంథాల ప్రకారం, ఈసారి జన్మాష్టమి నాడు రోహిణి నక్షత్రం ఉంటుంది. చంద్రుడు వృషభరాశిలో ఉంటాడు. జన్మాష్టమి నాడు ఇది అరుదైన పరిస్థితి. ఈ కారణంగా, ఈ సమయం మొత్తం 12 రాశుల వారికి వరంలా ఉంటుంది.శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని పనులు చేయడం ద్వారా ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని జ్యోతిష్యులు నమ్ముతారు. ం
వేద పండితుల ప్రకారం, శ్రీకృష్ణ జన్మాష్టమి 2023న కన్నయ్యను సంతోషపెట్టడానికి ప్రత్యేకంగా ఏదైనా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడికి పంచామృతంతో అభిషేకం చేయాలి. అనంతరం శ్రీకృష్ణుడికి పిండి పదార్థాలను సమర్పించుకోవాలి. భక్తి శ్రద్ధలతో అతడిని పూజించాలి. ఇలా చేయడం ద్వారా శ్రీకృష్ణుడి చల్లని చూపు సదరు వ్యక్తితో పాటు కుటుంబంపై కూడా ఉంటుందని జ్యోతిష్యుల నమ్మకం.
హిందూపురాణాల ప్రకారం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి రోజున అర్ధరాత్రి రోహిణి నక్షత్రం కారణంగా సర్వార్థసిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. రోహిణి అంటే చంద్రుని భార్య . వృషభ రాశిలో ( చంద్రుని భార్య) రోహిణి నక్షత్రం సంచరించడం వలన కలిగే యోగం ఆరాధనపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది.
ఈ రోజున, శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంగా భూమిపైకి వచ్చాడని హిందూ గ్రంథాలు పేర్కొంటున్నాయి. భగవద్గీత ... భాగవత పురాణం, ప్రాచీన హిందూ సాహిత్యం రచనలు, కృష్ణ భగవానుడి పుట్టుక గురించి విశదీకరించాయి. అతని మేనమామ కంసుడు రాజ్య పాలన చేయుచున్నాడు. శ్రీకృష్ణుణిని చంపేందుకు చిత్ర విచిత్రంగా కుట్రలు పన్నాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
శ్రీకృష్ణుడు శ్రావణ మాసం బహుళ పక్షం అష్టమి రోజున జన్మించాడు. కాబట్టి ఆ రోజున జన్మాష్టమిని పండుగను జరుపుకుంటారు, దీనిని కృష్ణపక్షంగా పిలుస్తారు. యమునా నది వారి చుట్టూ ప్రవహించడంతో శ్రీకృష్ణుడిని అతని తండ్రి వసుదేవుడు ఒక బుట్టలో వేసి బృందావనానికి తీసుకెళ్లారు. యశోద .. నంద కృష్ణుడిని దత్తత తీసుకుని పెంచుతుంది. జన్మాష్టమి చెడుపై మంచి సాధించిన విజయంగా జరుపుకుంటారు.