కృష్ణుడికి ఇష్టమైన పిండి వంటలు ఇవే.. మీరూ మీ పిల్లలకు పెడుతున్నారా..

కృష్ణుడికి ఇష్టమైన పిండి వంటలు ఇవే.. మీరూ మీ పిల్లలకు పెడుతున్నారా..

చిన్ని కృష్ణుడు అనగానే గుర్తొచ్చేది ఆయన చేసిన వెన్నదొంగతనాలు, చిలిపి పనులు, వెన్న కోసం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కుచేలు దుపెట్టిన గుప్పెడు అటుకులకు కరిగిపోయాదు. శ్రీకృష్ణుణ్ని కృష్ణాష్టమి రోజున బుడి బుడి అడుగులతో ఇంటికి ఆహ్వానించి కమ్మ అటుకులతో, వెన్నతో ఈ వంటలు చేసి పెడితే సరి...

పల్లీ అటుకుల లడ్డు

కావాల్సినవి

అటుకులు - అరకప్పు, పల్లీలు-ఒకకప్పు నువ్వులు - అరకప్పు, బెల్లం ఒక తప్పు... యాలకుల పొడి - టీ స్పూన్
 
తయారీ:

పాన్ వేడిచేసి పల్లీలు వేగించిపొట్టుతీయాలి. అదేకదాయిలో అటుకులు వేగించాలి. తర్వాత నువ్వులు వేసి కొన్ని నీళ్లు చిలకరించి ఎర్రగా వేగించాలి. వేగించిన అటుకులను మెత్తటి పౌడర్ చేయాలి. పల్లీలు, నువ్వులు పొడిచేశాక దాంట్లో బెల్లం చేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అటుకుల పొడి, యాలకులపొడి: వేసి గట్టిగా పిసుకుతూ కలపాలి. తర్వాత గట్టిగా లయాలు చుట్టాలి, లడ్డూ చుట్టరు. -కష్టమైతే కొన్ని నీళ్లు లేదా నెయ్యి వేసి కలుపుతూ లడ్డూ చేయొచ్చు.

అటుకులు కొబ్బరి పొంగలి

కావాల్సినవి

అటుకులు-రెండు కప్పులు, బెల్లం - ఒకటిన్నర కప్పు, నీళ్లు- తగినన్ని, పచ్చికొబ్బరి తురుము- ముప్పావు. కప్పు, నెయ్యి- కొద్దిగా, జీడిపప్పు - పావుకప్పు, ద్రాక్ష - రెండు టీస్పూన్లు యాలకులు-మూడు పచ్చకర్పూరం- పావు చిటికెడు.

తయారీ:

అటుకులను జల్లెడలో వేసి నీళ్లు పోసి తడపాలి. తడిపిన అటుకులను అరగంట సేపు పక్కనబెట్టాలి. కడాయిలో బెల్లం వేసి పావుకప్పు నీళ్లు పోసి కరిగించి తర్వాత వడకట్టాలి. వడకట్టిన పాకాన్ని మళ్లీ కడాయిలో పోసి కొబ్బరి తురుము వేయాలి. రెండు నిమిషాల తర్వాత తడిపిన అటుకులు వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. మరో కడాయిలో నెయ్యి వేడిచేసి జీడిపప్పు, ద్రాక్ష వేగించాలి. వాటిని అటుకుల పొంగలిలో వేసి కలిపితే అటుకుల కొబ్బరి పొంగలి రెడీ.

అరటిపండు రవ్వ కేసరి

కావాల్సినవి:

అరటిపండ్లు- రెండు, బొంబాయి రవ్వ - ఒక కప్పు మ్యొ-కొద్దిగా, జీడిపప్పు- మూడు టేబుల్ స్పూన్లు, ద్రాక్ష - రెండు టేబుల్ స్పూన్లు చక్కెర-అరకప్పు, పాలు- ఒకటిన్నర కప్పు యాలకులపొడి- అరటీ స్పూన్, బాదం - కొద్దిగా

తయారీ:

బాండీలో నెయ్యి చేదివేసి జీడిపప్పు, ద్రాక్ష వేగించాలి. అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేడిచేయాలి. సన్న మంటమీద బొంబాయి రవ్వను ఎర్రగా అయ్యేవరకు వేగించాలి. తర్వాత అరటి పండ్ల ముక్కలు వేసి గరిటెతో మ్యాచ్ చేస్తూ వేగించాలి. అలా ఐదు నిమిషాలు వేగించాక పంచదార వేసి కలపాలి. చక్కెర మొత్తం రవ్వలో కలిసిపోయాక పాలుపోసి ఉడికించాలి. చివర్లో. జీడిపప్పు, ద్రాక్ష, నానబెట్టిన బాదంతో గార్నిష్ చేస్తే అరటి పండు రవ్వ కేసరి రెడీ.

అటుకుల స్వీట్

కావాల్సినవి:

అటుకులు – ఒక కప్పు,

బెల్లం - పావు కప్పు,

పచ్చి కొబ్బరి తురుము - ఆరు టేబుల్ స్పూన్లు,

కొబ్బరి పాలు - మూడు టీస్పూన్స్,

యాలక్కాయ - ఒకటి.

తయారీ:

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుమును గార్నిష్ చేయడం కోసం పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో అటుకులు, కొబ్బరి తురుము, యాలకల గింజలు, బెల్లం వేసి బాగా అంటే అటుకులు బెల్లం బాగా కలిసే వరకు కలపాలి. దీనిపైన కొబ్బరి పాలు చిలకరించి కలపాలి.కొబ్బరి పాలు అటుకుల్ని మెత్తగా చేస్తాయి. వెంటనే తినొచ్చు లేదా ఫ్రిజ్ లో పెట్టి మరుసటి రోజు కూడా తినొచ్చు.

  • దీన్ని ముందు రోజు రాత్రి చేసి పెట్టకుంటే మరుసటి రోజుకు హడావిడి లేకుండా బ్రేక్ ఫాస్ట్ రెడీగా ఉంటుంది.
  • ఒకవేళ కొబ్బరి తినడం ఇష్టం లేదనుకుంటే బాదం లేదా మీకు నచ్చిన నట్స్ వాడొచ్చు.