![పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జన్నారం వాసులు](https://static.v6velugu.com/uploads/2025/02/jannaram-residents-contest-graduate-mlc-elections-as-independents_TSlf734aiJ.jpg)
జన్నారం, వెలుగు: మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జన్నారం మండలం నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారు. చింతగూడ గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మేకల అక్షయ్ కుమార్ గురువారం తన మద్దతుదారులతో కలిసి కరీంనగర్ కలెక్టరేట్ ఆఫీస్ లో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
దేవునిగూడకు చెందిన గవ్వల శ్రీకాంత్, గవ్వాల లక్ష్మి గత రెండు రోజుల క్రితమే నామినేషన్లు దాఖలు చేశారు. కలమడుగుకు చెందిన ట్రస్మా స్టేట్ మాజీ ప్రెసిడెంట్ యాదగిరి శేఖర్ రావు, పొనకల్ గ్రామానికి చెందిన రాపాల రాజు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఇంటిపెండెంట్గానే పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.