కోర్సు ఫీజులు మొత్తం ప్రభుత్వమే భరించాలి : జన్నారపు రాజేశ్వర్

నిజామాబాద్ సిటీ, వెలుగు: గిరిరాజ్ కాలేజ్ లో పీజీ చదువుతున్న స్టూడెంట్స్​కు కోర్సు ఫీజు మొత్తం ప్రభుత్వమే భరించాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం జీజీ కాలేజీని ముట్టడించిన పీడీఎస్ యూ సభ్యులు ప్రిన్సిపాల్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్​సభ్యులు మాట్లాడుతూ.. కాలేజీలో  పీజీ విద్యార్థులకు కోర్స్ ఫీజు ఏడాదికి రూ.36,000 ఉంటే ప్రభుత్వం కేవలం రూ.20,000 మాత్రమే ఇస్తుందన్నారు.

మిగతా రూ.16,000 విద్యార్థులే కట్టాలని ప్రిన్సిపాల్ ఆదేశిస్తున్నారన్నారు. ట్యూషన్ ఫీజు కట్టకపోతే సెమిస్టర్  ఫీజులు కట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టి, సరిపడా లెక్చరర్స్, ల్యాబ్ సౌకర్యాలు కల్పించలేదన్నారు. మూడో సెమిస్టర్ సిలబస్ పూర్తికాకముందే పరీక్షల షెడ్యూల్​ఇచ్చారన్నారు.సెలబస్ పూర్తయ్యేంతవరకు పరీక్షలు నిర్వహించొద్దని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. పీడీఎస్​యూ జిల్లా కోశాధికారి దేవిక, రాజు, విద్యార్థులు అఖిల, సుబుర్, నిదా, మేఘన,ప్రవీణ్ పాల్గొన్నారు.