- పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్
నిజామాబాద్ సిటీ, వెలుగు: గిరిరాజా కాలేజీలో బోధిస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని, ట్యూషన్ ఫీజు ప్రభుత్వమే చెల్లించాలని శనివారం పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గిరిరాజ్ డిగ్రీ , పీజీ కళాశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటారని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో ట్యూషన్ ఫీజు చెల్లించకపోవడంతో వారిపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు.
పీజీ విద్యార్థులకు సంవత్సరానికి రూ.36 వేలకుగాను రూ.20 వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. మిగతా ఫీజు విద్యార్థులు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను వెంటనే రెగ్యులర్ కోర్సులుగా మార్చి ట్యూషన్ ఫీజు మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ లో ఉన్న ఫీజు రియింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ నిధులను విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు వంశీ, విష్ణు, సిద్ధార్థ, సాయి, అభిరామ్, వంశీ కార్తీక్, తరుణ్, దశరథ్ తదితరులు
పాల్గొన్నారు.