షాంఘై మాస్టర్స్ టైటిల్ విజేతగా జానిక్ సిన్నర్ నిలిచాడు. ఆదివారం (అక్టోబర్ 13) జరిగిన షాంఘై మాస్టర్స్‌లో నొవాక్ జొకోవిచ్‌ను 7-6 (4), 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. ప్రస్తుతం నెంబర్ 1 ర్యాంక్ లో కొనసాగుతున్న సిన్నర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూ ఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్స్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు కెరీర్ లో 100 వ టైటిల్ గెలవాలని ఆశించిన 24 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ నోవాక్ జొకోవిచ్ కు నిరాశే ఎదురైంది. ఇప్పటివరకు టెన్నిస్ లో జిమ్మీ కానర్స్ 109 టైటిల్స్ తో ప్రధమ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 103 టైటిల్స్ తో రెండో స్థానంలో నిలిచాడు.
తొలి సెట్ లో సిన్నర్ కు గట్టి పోటీ ఇచ్చినా రెండో సెట్ లో తేలిపోయాడు. ఈ ఏడాది సిన్నర్ చేతిలో ఓడిపోవడం జొకోవిచ్ కు ఇది మూడో సారి కావడం విశేషం. ఈ మ్యాచ్ లో సిన్నర్ మొత్తం ఎనిమిది ఏస్‌లు, 22 విన్నర్లు కొట్టాడు. మరోవైపు జొకోవిచ్ నాలుగు ఏస్‌లు, 12 విన్నర్లు కొట్టాడు. జొకోవిచ్ కు సిన్నర్ ఒక్క బ్రేక్ పాయింట్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు.
IMMENSO SINNER 💪🇮🇹💪
— Tennis TV (@TennisTV) October 13, 2024
The moment Jannik Sinner defeated Djokovic to claim his 4th ATP Masters title 🏆@janniksin #RolexShanghaiMasters pic.twitter.com/gUBIocvvgQ