యూఎస్ ఓపెన్ 2024 టైటిల్ ను ఇటాలియన్ ప్లేయర్.. వరల్డ్ నెంబర్ వన్ సిన్నర్ గెలుచుకున్నాడు. ఫైనల్లో అతను లోకల్ బాయ్ అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్ పై వరుస సెట్లలో విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌ను 6-3, 6-4, 7-5 స్కోరుతో సిన్నర్ ఓడించి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్ ను తన కెరీర్ లో అందుకున్నాడు. తొలి రెండు సెట్లు ఈజీగా గెలుచుకున్న సిన్నర్ కు మూడో సెట్ లో ప్రతిఘటన ఎదురైంది. అయితే 12 వ గేమ్ లో బ్రేక్ పాయింట్ సాధించి మ్యాచ్ తో పాటు టైటిల్ గెలుచుకున్నాడు.
Also Read:-దులీప్ ట్రోపీలో ఇండియా బి గెలుపు
సిన్నర్ కెరీర్ లో ఇది రెండో గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్. ఇదే ఏడాది అతను ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఒకే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్న నాలుగో ప్లేయర్ గా సిన్నర్ అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి ఇటలీ ప్లేయర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో సిన్నర్ తన నెంబర్ వన్ ర్యాంక్ ను మరింత పదిలం చేసుకున్నాడు. మరోవైపు టోర్నీ అంతటా అద్భుత ఆట తీరును ప్రదర్శించిన ఫ్రిట్జ్ ఫైనల్లో తేలిపోయాడు. కనీసం ఒక్క సెట్ కూడా గెలవలేకపోయాడు.
Andre Agassi presents Jannik Sinner with his first US Open trophy! 🏆 pic.twitter.com/YGpyScXcbq
— US Open Tennis (@usopen) September 8, 2024