పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకునేలా ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రజలే సీఎం అభ్యర్థిని ఎన్నుకునేలా ఓ ఫోన్ నంబర్ ను ఏర్పాటు చేశారు. సీఎంగా ఎవరు కావాలో ఆ నెంబర్ కు ఫోన్ చేసి అభ్యర్థి పేరు చెప్పాలని సూచించారు. 7074870748 నెంబర్ కు ఫోన్ చేసి అభిప్రాయం చెప్పొచ్చని అన్నారు. ఇన్నేళ్ల నుంచి ఎన్నికలు జరుగుతున్నా.. ఎప్పుడూ ఏ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండదన్నారు. దేశ చర్రితలోనే సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావొచ్చునని తెలిపారు కేజ్రీవాల్ .ఫోన్ చేసి గానీ, వాట్సాప్ లో మెసేజ్ ద్వారా గానీ ప్రజలు అభిప్రాయం చెప్పవచ్చన్నారు. జనవరి 17 సాయంత్రం 5 గంటల లోపు ప్రజలు తమ ఇష్టాన్ని చెప్పాలన్నారు.దీనికి సంబంధించి ఈ విషయాన్ని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు కేజ్రీవాల్.
వాస్తవానికి ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్ ఉన్నా ఆయనపై చాలా మంది నేతలు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయంలోనూ కేజ్రీవాల్ స్పందించారు. భగవంత్ మన్ తనకు అత్యంత కావాల్సిన వ్యక్తి అని అన్నారు. తాము ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నా.. ఆ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేద్దామంటూ ఆయనే సలహా ఇచ్చారని చెప్పారు.
The people of Punjab will govern Punjab ?#JantaChunegiCM pic.twitter.com/mxKHEkODuV
— AAP Punjab (@AAPPunjab) January 13, 2022
మరిన్ని వార్తల కోసం..