సినిమాకి పోయినప్పుడే లేకపోతే ఇంట్లో ఫ్యామిలీమెంబర్స్ తో క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడో.. మన చేతికి దొరికే ఏకైక టైమ్ పాస్ 'పాప్ కార్న్'. ప్రయాణాల్లో కూడా చాలా మందికి ఇది ఫేవరెట్ స్నాక్ ఐటం.మొక్కజొన్న కెర్నల్ (గుజ్జు)ను వేడి చేసినప్పుడు పాప్ కార్న్ గా మారుతుంది. అధిక ఫైబర్ కలిగిన పాప్ కార్న్ ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. అలాంటిది పాప్ కార్న్ కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉంటే తప్పేంటి?. ఈ ఆలోచన వచ్చిన రోజునే అనగా 1988 జనవరి 19ని పాప్ కార్న్ డే మార్చేశారు మనోళ్లు.. అప్పటినుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు పాప్ కార్న్ ప్రియులు.
వేల ఏండ్ల చరిత్ర..
పాప్ కార్న్ కి సుమారు 2 వేల సంవత్సరాల చరిత్ర ఉందనేది ఓ అభిప్రాయం. అయితే క్రీస్తు పూర్వం 3 వేల సంవత్సరంలో మెక్సికో, పెరూ దేశ ప్రజలు కండులను పండించేవాళ్లని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ సమయంలోనే వాళ్లు పాప్ కార్న్ తినేటోళ్లని ఆధారాలు కూడా దొరికాయట. అక్కడి నుంచి మిగతా దేశాలకు పాప్ కార్న్ ఫుడ్ కల్చర్ విస్తరించిందని వారంటున్నారు.
Also Read :- ఇండియాలో పెట్రోల్పై 260 శాతం పన్ను వేస్తున్నారా
ఇవాళ ఏం చేస్తరు?
'ఒకగిన్నెడు తాజా పాప్ కార్న్ మీ రోజును సంతోషంగా ఉంచుతుంది.. ఇది పాప్ కార్న్ డే థీమ్, డెగ్యులర్ ఫుడ్ తోపాటు ఇవాళ పాప్ కార్న్ ను మెనులో చేర్చాలి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పాప్ కార్న్ డే వేడుకలను నిర్వ హిస్తుంటాయి. అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్రం పాప్ కార్స్కి అధికారిక స్నాక్ గుర్తింపు ఇచ్చింది.
పాప్ కార్న్ ప్రయోజనాలు
- పాప్కార్న్ లో ఫైబర్, యాంటీ అక్సిడెంట్, విటమిన్-బి కాంప్లెక్స్, మాంగనీస్, మెగ్నీషి యం, ఐరన్ ఉంటాయి.
- కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
- దయాబెటిక్ ఫ్రెండ్లీ స్నాక్.. రక్తంలో షుగర్ లెవల్ని నియంత్రిస్తుంది.
- వృద్ధాప్య ఛాయల్ని దరిచేరనీయదు.
- 0 బరువు తగ్గడంలో, ఎముకలు పటిష్టపర్చడంలో తోడ్పడుతుంది.
బయట దొరికే పాప్ కార్న్ పై ఉప్పు, వెన్న, చక్కెర పాకాన్ని చల్లి అమ్ముతుంటారు. అవి రుచిగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే బయట కొనుక్కునే కన్నా ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది ఎలాంటి రుచులను కలపకుండానే నేరుగా తినడమే ఉత్తమమైన మార్గం. పాప్ కార్న్ ను రుచి కోసం మాత్రమే కాకుండా.. పోషక విలువ కోసం కూడా ఆస్వాదించండి.