ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ రోజు గురించే మాట్లాడుకుంటుంది. చాలా దేశాలు ఆ రోజు గురించి చర్చించుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు.. అన్ని దేశాల్లో ప్రకృతి విపత్తులు, విధ్వంసాలు జరగటం చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ ఆ తేదీ ఏదీ అంటారా.. 2025, జనవరి 9వ తేదీ.. గురువారం. జనవరి 9వ తేదీన ఏయే దేశంలో ఏం జరిగిందో తెలుసుకుందామా..
అమెరికాలో కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు మొదలైంది జనవరి 9వ తేదీనే. ఇప్పటికీ ఆ మంటలు ఆరలేదు. లక్షల కోట్ల ఆస్తి నష్టం.. లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. లాస్ ఏంజిల్స్ కార్చిచ్చుకు లాస్ ఏంజిల్స్ బూడిదగా మారింది. అమెరికాలో చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటనకు కారణం అయిన తేదీ జనవరి 9వ తేదీ.. 2025.
- జనవరి 9వ తేదీన బ్రెజిల్ దేశంలో వరదలు వచ్చాయి. ఇరుపి సిటీని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు వీధులు నదులు అయ్యాయి. కార్లు, బైక్స్ నీళ్లల్లో కొట్టుకుపోయాయి. ఇళ్లు కూలిపోయాయి. సిటీ అంతా చిన్నాభిన్నం అయ్యింది.
- అదే జనవరి 9వ తేదీ.. సౌదీ అరేబియాలో కుండపోత వర్షం. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఆ రోజు అప్పటికప్పుడు మారిపోయిన వాతావరణం. కారు మబ్బులు కమ్మేశాయి. కుండపోత వర్షం.. భీకర గాలులు. సౌదీ అరేబియాను వణికించేసింది.
- అదే జనవరి 9వ తేదీన ఒమెన్ దేశంలోనూ కుండపోత వర్షం పడింది. ఒమెన్ దేశం ఏకంగా ఎమర్జెన్సీ ప్రకటించింది. చరిత్రలో ఊహించనంత వర్షం పడింది. వరదలు వచ్చాయి.
- అదే జనవరి 9వ తేదీ సౌత్ ఆఫ్రికాలోనూ ప్రకృతి బీభత్సం జరిగింది. లింపోపో, ఫ్రీ స్టేట్, కాజుల్ నటల్ రాష్ట్రాల్లో తుఫాన్ బీభత్సం చేసింది. వరదలకు వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది.
- జనవరి 9న జపాన్ దేశంలో మంచు తుఫాన్. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మంచు పడింది.
- అదే జనవరి 9న జర్మనీ దేశంలోని దుస్సేల్ డ్రాప్, నార్త్ రెని, వెస్ట్ ఫాన ఏరియాల్లో కొన్ని గంటలపాటు ఆగకుండా మంచు పడింది.
- అదే జనవరి 9న రష్యా సైతం వణికిపోయింది. మంచు తుఫాన్ రష్యాను కల్లకల్లోలం చేసింది. ఓర్కుట ఏరియా అయితే జీరో విజిబులిటీతో మంచు తుఫాన్ బీభత్సం చేసింది. రవాణా వ్యవస్త స్తంభించింది.
- అదే జనవరి 9వ తేదీ ఫ్రాన్స్ దేశం సైతం ఊహించని విపత్తును ఎదుర్కొన్నది. విల్లీ విలైనీ నది ఉగ్రరూపం దాల్చింది. ఈ నదికి గండ్లు పడి నీళ్లు ఊర్లను ముంచెత్తింది. ఫ్రాన్స్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని అక్కడ మీడియా చెబుతోంది.
మొత్తంగా అయితే జనవరి 9వ తేదీన ప్రపంచంలో జరిగిన విపత్తులపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. ఆ రోజు అంత దరిద్రమైన రోజా.. అన్ని దేశాల్లోనూ ఇంత ఘోరం జరిగిందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.