జన్వాడ ఫామ్ హౌస్ కేస్: చేవెళ్ల పోలీస్ స్టేషన్‎కు రాజ్ పాకాల, విజయ్ మద్దూరి

జన్వాడ ఫామ్ హౌస్ కేస్: చేవెళ్ల పోలీస్ స్టేషన్‎కు రాజ్ పాకాల, విజయ్ మద్దూరి

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‎లో కాకరేపిన జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆధారాలు సేకరించిన చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ఇందులో భాగంగానే 2024, నవంబర్ 1న జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కీలక నిందితులైన కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల, విజయ్ మద్దూరిలను చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. 

రాజ్ పాకాల ఇంట్లో జరిగిన పార్టీలో డ్రగ్స్ కోణాలపై అరా తీస్తున్న పోలీసులు.. మరోవైపు విజయ్ మద్దూరి ఫోన్‎కు సంబంధించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇది వరకే మోకిలా పోలీసులు రాజ్ పాకాలను, విజయ్ మద్దూరి విడివిడిగా దర్యాప్తు చేశారు. దీనికి కొనసాగింపుగా శుక్రవారం చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. 

కాగా, రంగారెడ్డి జిల్లా శంకర్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం జన్వాడ పరిధిలో అక్టోబర్ 26న  కేటీఆర్‌‌‌‌‌‌‌‌ బామ్మర్ది  రాజ్‌‌‌‌‌‌‌‌ పాకాలకు చెందిన ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌లో పార్టీ జరిగింది.‌‌ అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు ఫారిన్​లిక్కర్​వాడినందుకు ఎక్సైజ్ యాక్ట్​ కింద కూడా కేసు ఫైల్​చేశారు. ఫామ్​హౌస్లో నిర్వహించిన సోదాల్లో 12  ఫారిన్ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్స్‌‌‌‌‌‌‌‌..  ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన రెండు నాన్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్స్.. 11 కేఎఫ్‌‌‌‌‌‌‌‌ బీర్లు.. 7.35 లీటర్లు టీజీ ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ బాటిల్స్‎ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పెద్ద మొత్తంలో క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్‌‌‌‌‌‌‌‌ కార్డ్స్‌‌‌‌‌‌‌‌ సీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

పార్టీలో 22 మంది పురుషులు,18 మంది మహిళలతో పాటు ఐదుగురు పిల్లలున్నట్టు పోలీసులు గుర్తించారు.  22 మందికి డ్రగ్స్​ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేయగా ప్రముఖ వ్యాపారి విజయ్‌‌‌‌‌‌‌‌ మద్దూరి  కొకైన్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నట్లు నిర్ధారణయింది. ఎన్డీపీఎస్​యాక్ట్ కింద కేటీఆర్​ బామ్మర్ది రాజ్ పాకాల (50), విజయ్​ మద్దూరి (55), ఫామ్​హౌస్​మేనేజర్​ కార్తీక్​(30)పై మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా రాజ్​పాకాల, ఏ2గా విజయ్​మద్దూరి, ఏ3గా కార్తీక్ను చేర్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ పాకాల స్వయాన కేటీఆర్ బామ్మర్ది కావడంతో జన్వాడ ఫామ్ హౌస్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ ముమ్మరం చేశారు.