- అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తయి: షబ్బీర్ అలీ
- కేటీఆర్ సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతుండని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్.. ఆయన బామ్మర్ది రాజ్ పాకాల, ఇద్దరు కలిసి ఒకసారి నార్కో టెస్టు చేయించుకుంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సూచించారు. డ్రగ్స్ అనగానే ప్రతిసారి కేటీఆర్ ఎందుకు స్పందిస్తున్నారని, అసలు ఆయనకు డ్రగ్స్ కు ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్ లో షబ్బీర్అలీ మీడియాతో మాట్లాడారు.
జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్, పేకాట కార్డ్స్, క్యాసినో, ఫారిన్ లిక్కర్ తో రాజ్ పాకాల అడ్డంగా దొరికిపోయినా.. కేటీఆర్ సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతివారం ఫామ్ హౌస్ లో రాజ్ పాకాల రేవ్ పార్టీలు నిర్వహిస్తారనే పక్కా సమాచారంతోనే పోలీసులు దాడులు చేశారన్నారు. త్వరలో తెలంగాణ ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. హవాయ్ చెప్పులు వేసుకున్న కేసీఆర్ కుటుంబానికి ఇప్పుడు ప్రైవేటు జెట్లలో తిరిగేంత కోట్లకొద్ది సంపద ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ఎంపీ హోదాలో ఉన్నప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ వాస్తవాలు చూపించినందుకు అండర్ ట్రయిల్ ముద్దాయిగా జైల్లో ఉంచి, ఆయన్ను హ్యత చేయాలని చూశారని ఆరోపించారు.