కేటీఆర్ సమాధానం చెప్పు
గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం రేవంత్ ప్రయత్నిస్తుంటే మీ బామ్మర్ది ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీలా..? కేటీఆర్.. రాష్ట్రంతో పాటు యువతకు దీనిపై ఏం సమాధానం చెప్తవ్? రేవ్ పార్టీలో ఎంతటి వారున్న ఊరుకునేది లేదు. కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం. ఆయన బామ్మర్ది రాజ్‌పాకాల ఎంతో మందికి డ్రగ్స్ అలవాటు చేశాడు. వాళ్ల జీవితాలతో పాటు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేశాడు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి వైట్ చాలెంజ్‌కి సిద్ధమా? అని అంటే కేటీఆర్ ఎందుకు ముందుకురాలేదో చెప్పాలి.
- ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్
డ్రగ్స్ స్టేట్ గా చేస్తున్నరు..
కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల తన ఫామ్ హౌస్ లో డ్రగ్స్, విదేశీ మద్యంతో పార్టీ ఇచ్చాడు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, కేటీఆర్ అండ్ బ్యాచ్ మాత్రం రాష్ట్రాన్ని డ్రగ్స్ స్టేట్ గా చేస్తున్నది. ఈ పార్టీలో ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. ఎంతటివారైనా కఠినంగా శిక్షించాల్సిందే.
అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ
గత బీఆర్ఎస్ పాలనంతా రేవ్ పార్టీలే..
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిందంతా రేవ్పార్టీలే. యువతను మత్తుకు బానిసలు చేసిందే బీఆర్ఎస్. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ కోసం కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుంటే.. కేటీఆర్ బామ్మర్ది మళ్లీ డ్రగ్స్ వ్యవహారం నడిపిస్తున్నడు. ఇందులో కేసీఆర్ బంధువులు, కేటీఆర్ ఇంకా ఎంత పెద్దవారు ఉన్నా వదిలిపెట్టొద్దు. కఠినంగా శిక్షించాల్సిందే.
- శివసేనా రెడ్డి, శాట్ చైర్మన్
యువరాజులంతా డ్రగ్స్ తీసుకుంటున్నరు..
వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రేవ్పార్టీలని, రావుల పార్టీలని యువరాజులంతా ఒక్కచోట కూర్చొని డ్రగ్స్ తీసుకుంటున్నారు. జన్వాడా ఫామ్ హౌస్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ బయటపెట్టాలి. అక్కడి సీసీ ఫుటేజీని వెంటనే విడుదల చేయాలి. ఫామ్‌హౌస్ లో జరిగిన పార్టీ రాజుదా? యువరాజుదా? రేవ్పార్టీనా? రావుల పార్టీనా? డ్రగ్స్ఉన్నాయా? ఫారిన్లిక్కర్ఉన్నదా? అన్న విషయం ప్రజలకు తెలియజేయాలి. దోషులను కఠినంగా శిక్షించాలి.
సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నరు..
కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్నది. ఓవైపు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే.. మరోవైపు కేటీఆర్ సొంత బామ్మర్ది ఫామ్‌హౌస్ లో డ్రగ్, రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. ఇలాంటి పార్టీలతో కేటీఆర్, ఆయన బామ్మర్ది సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు. పోలీసుల రెయిడ్ కంటే ముందే 20 మంది అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం ఉంది. - అద్దంకి దయాకర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి
ఎవరినీ వదలొద్దు..
రాష్ట్రంలో కొంతమంది బడా నాయకులు డ్రగ్స్ తీసుకుంటూ యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. కేటీఆర్ బామ్మర్ది తన ఫామ్‌హౌస్‌లో ఇచ్చిన పార్టీలో బడా బాబులు ఉన్నారని తెలుస్తున్నది. ఇందులో ఎవరున్నా వదిలిపెట్టొద్దు. పార్టీలో పాల్గొన్న అందరి వివరాలను బయటపెట్టాలి.
- బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ
సమగ్ర విచారణ జరిపించాలి: సైబరాబాద్ ఏసీపీకి సుజాత ఫిర్యాదు
జన్వాడ ఫామ్‌హౌస్ లో శనివారం రాత్రి జరిగిన పార్టీపై సమగ్ర విచారణ జరపాలని సైబరాబాద్ఏసీపీకి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత, మహిళా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అక్కడ రేవ్ పార్టీ జరిగిందని, డ్రగ్స్ వినియోగించారని, విదేశీ మద్యం ఉన్నదని.. వీటన్నింటిపై విచారణ జరపాలని కోరారు. ఈ కేసులో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. ఇందులో ఎవరున్నా కఠినంగా శిక్షించాలని కోరారు. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.