మేమున్నాం..జపాన్లో ఇండియన్స్ కోసం కంట్రోల్ రూం

జపాన్లోని భారతీయ పౌరుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది ఇండియ ఎంబసీ. జపాన్ లోని భారతీయులకు సాయం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది.

ఏదైనా సహాయం కోసం కింది నంబర్లకు డయల్ చేయాలి.

+81-80-3930-1715 (మిస్టర్ యాకుబ్ టోప్పో)
+81-70-1492-0049( మిస్టర్ అజయ్ సేథి)
+81-80-3214-4734( మిస్టర్ డీఎన్ బార్న్ వాల్) 
+81-80-6229-5382( మిస్టర్ ఎస్ భట్టాచార్య)
+81-80-3214-4722( మిస్టర్ వివేక్ రాథీ )

ఈ నంబర్లలో సంప్రదించాలని జపాన్ లోని భారత రాయబార కార్యాలయం కోరింది. 

జపాన్ లోని భారతీయులు సహాయం కోసం ఈ క్రింది ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. 

sscons.tokyo@mea.gov.in
offseco.tokyo@mea.gov.in

సోమవారం ( జనవరి 1 2024)న మధ్య జపాన్ లో వరుస భూకంపాలతో అతలాకుతలం అయింది. కేవలం 90 నిమిషాల వ్యవధిలో 21 భూప్రకంపనలు సంభవించాయి. అన్ని భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతతో నమోదు అయ్యాయి.వీటిలో రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రత తో శక్తివంతమైన భూకంపం సంభవించింది.