దబిడి దిబిడి సాంగ్ కి జపాన్ అమ్మాయిల మాస్ స్టెప్స్.. గ్లోబల్ వైడ్ గా ట్రెండింగ్...

దబిడి దిబిడి సాంగ్ కి జపాన్ అమ్మాయిల మాస్ స్టెప్స్.. గ్లోబల్ వైడ్ గా ట్రెండింగ్...

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలోని దబిడి దిబిడి సాంగ్ మొదట్లో ట్రోల్ అయినప్పటికీ బాలయ్య ఊర్వశి మాస్ స్టెప్పులని థియేటర్స్ లో ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ సాంగ్ కి గ్లోబల్ వైడ్ గా రీచ్ వస్తోంది. 

జపాన్ కి చెందిన నలుగురు అమ్మాయిలు కలసి దబిడి దిబిడి సాంగ్ కి స్టెప్పులు వేస్తూ రీల్ చేశారు. ఇందులో లిరిక్స్ ని పర్ఫెక్ట్ గా సింక్ చేస్తూ మాస్ స్టెప్స్ తో అలరించారు. ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నటి ఊర్వశి రౌటేల కూడా ఈ రెల్ ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో షేర్  చేసింది. దీంతో ఈ మధ్య తెలుగు సాంగ్స్ కి గ్లోబల్ వైడ్ గా రీచ్ వస్తోందని హ్యాపీగా ఉందంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 

ALSO READ | Laila movie Day 1 collections: లైలా మూవీ కలెక్షన్ ఇంత దారుణమా.. సినీ ఇండస్ట్రీలోనే ఇదో రికార్డ్..

ఆ మధ్య టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ నటించిన గుంటూరు కారం సినిమాలోని "కుర్చీ మడతపెట్టి" సాంగ్ కూడా గ్లోబల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. అంతేకాదు ఇప్పటివరకూ ఈ సాంగ్ 700 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్ కూడా బాగానే ట్రెండ్ అయ్యింది. అయితే ప్రపంచంలో అత్యధికంగా సోషల్ మీడియా వినియోగించే దేశాలలో భారత్ టాప్ లో ఉంటుంది. దీంతో ఈమధ్య ఇతర దేశాలకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్స్ వ్యూస్, రీచ్, ఫాలోవర్స్ కోసం తెలుగు, హిందీ సాంగ్స్ ని ఎంచుకుంటున్నారు.