జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారానికి 4 రోజులే పని

జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారానికి 4 రోజులే పని

గతంలో జపాన్ అనగానే అందరికి గుర్తచ్చేది.. అమెరికా అణుబాంబు దాడులు. 1945 ఆగస్టు 6, 9తేదీలలో అమెరికా సైన్యం.. జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిపై రెండు అణు బాంబులను పేల్చింది. ఈ బాంబు దాడుల్లో దాదాపు 4 లక్షల మంది పౌరులు మరణించగా.. భూమిపై కాంక్రీట్ భవనాలు తప్ప మిగిలిన వస్తువులన్నీ మాయమైపోయాయి. భూమిపై గడ్డి కూడా మొలవదన్నారు. ఆ స్థాయి నుంచి జపాన్ కోలుకోగలిగింది అంటే, అందుకు ఆ దేశ పౌరుల్లో ఉన్న కసి, పట్టుదల, కష్టించి పని చేసే తీరు, నాయకులు తీసుకునే నిర్ణయాలు అన్నీ గొప్పే అని చెప్పుకోవాలి. 

ALSO READ | ఉద్యోగాలు పోయాయ్.. 1800 మందిని తొలిగించిన గోల్డ్‌మ్యాన్ సాక్స్

కానీ ఇప్పుడు జపాన్ అంటే నిర్వచనం మారింది.. టెక్నాలజీలో అగ్రశ్రేణి దేశాలకు సవాల్ విసురుతోంది. అక్కడి ప్రజలు ఎంతో క్రమశిక్షణగా ఉంటూ, దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అటువంటి తమ పౌరుల కోసం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం, కుటుంబం రెండింటి మధ్య ప్రజలు సమతౌల్యాన్ని సాధించేందుకు ఈ సూచనలు ఉపకరిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. 

4 రోజుల పని.. మూడ్రోజులు సెలవు

వారానికి 4 రోజుల పని.. మిగతా మూడ్రోజులు సెలవు. ఈ విధానాన్ని 2021లోనే అమలు చేయాలని జపాన్‌ నిర్ణయం తీసుకుంది. ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే పలు సంస్థలు దీనిని వ్యతిరేకించాయి. ఇలా చేయడం వల్ల అభివృద్ధి విషయంలో కొంత కాలానికి జపాన్‌ వెనుకపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కేవలం 8శాతం సంస్థలే దానిని అనుసరించగా.. 7 శాతం సంస్థలు కేవలం ఒక సెలవు మాత్రమే అమలు చేశాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అటువంటి సంస్థలు తప్పనిసరిగా మూడు రోజులు సెలవు ఇవ్వాల్సిందే. 

ఈ విధానాన్ని భారత్ లోనూ ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు. కాకపోతే అప్పుడు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. వారానికి 48 గంటలకు తగ్గకుండా పని చేయాలి.