Japan Earthquake: జపాన్ లో భారీ భూకంపం : సునామీ వార్నింగ్

జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.9 తీవ్రత నమోదు అయింది. భూకంపం ధాటికి నైరుతి జపాన్లోని క్యూషూ, కొచచి ప్రిఫెక్చర్ ప్రాంతం వణికి పోయింది. రోడ్లపై పెద్దపెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. భయంతో ప్రజలు పరుగులు పెట్టారు. మరోవైపు సునామీ వచ్చే ప్రమాదం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చ రించింది. 

జపాన్ కాలమానం ప్రకారం..  సోమవారం రాత్రి 9.19 గంటలకు భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ద్వీపం క్యుషు, దాని సమీపంలోని కొచ్చి ప్రిఫెక్చర్‌లో ప్రకంపనలు సంభవించాయి. ఎంతమేరకు నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.  భూకంప కేంద్రం సముద్రంలో 48 కిలోమీటర్లు లోతులో కేంద్రీకృతం అయినట్లు సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ వాతారణ శాఖ తెలిపింది.