పల్లెటూరి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే 3 లక్షలు : అమ్మాయిల రచ్చతో సర్కార్ షేక్

పల్లెటూరి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే 3 లక్షలు : అమ్మాయిల రచ్చతో సర్కార్ షేక్

పెళ్లి కాని ప్రసాద్ లు పెరిగిపోతున్నారు.. ఇది ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రతి దేశంలో జనాభా తగ్గుదల కనిపిస్తుంది. ముఖ్యంగా జపాన్ దేశంలో అయితే పెళ్లి, పిల్లలు, సంసారం అనే వాటికి దూరం అయ్యారు యువత. ముఖ్యంగా జపాన్ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు కొత్త స్కీం తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం.

ఈ స్కీం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జపాన్ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అబ్బాయిలను.. అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే మన భారత కరెన్సీలో మూడున్నర లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. జపాన్ దేశం కరెన్సీలో 6 లక్షల యెన్ లు.. ఈ డబ్బులు అమ్మాయిల బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. 

ఈ స్కీం తీసుకురావటానికి కారణం లేకపోలేదు. జపాన్ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో జనాభా సంఖ్య భారీ స్థాయిలో తగ్గిపోతుంది. అందరూ పట్టణాలు, నగరాలకు వలస వెళుతున్నారు. దీన్ని అరికట్టి.. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా సంఖ్య పెంచటమే ఈ పథకం ఉద్దేశం. జపాన్ దేశంలోని ఏ ప్రాంతం అమ్మాయి అయినా సరే.. గ్రామీణ ప్రాంతంలోని అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని.. అక్కడే నివాసం ఉండాలి. అక్కడే పిల్లలను కనాలి అన్నమాట.

ALSO READ | Family Matters : పెళ్లంటే భయమెందుకు..? యువతలో ఉన్న భయాలు ఏంటీ..?

ఈ పథకంపై ప్రతిపక్షాలకు విమర్శలకు దిగాయి. మహిళల స్వేచ్ఛకు. సమానత్వానికి ఇది భంగం అంటూ నిరసనలకు దిగారు. ఇక అమ్మాయిలు అయితే రచ్చ రచ్చ చేశారు. మేం అంత తక్కువగా కనిపిస్తున్నామా.. మాకు స్వేచ్ఛ లేదా.. మాకు సొంత ఆలోచన లేదా.. మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారా ఆందోళనలకు దిగారు. ప్రభుత్వం ఏదో అనుకుంటో.. అది మరోలా మారిపోయింది. మేం ఎవర్ని పెళ్లి చేసుకోవాలో కూడా ప్రభుత్వమే డిసైడ్ చేస్తుందా అంటూ జపాన్ అమ్మాయి గరం గరం అయ్యారు. దీంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. 

ఇదేదో జపాన్ దేశానికే పరిమితం అయిన సమస్యగా చూడాల్సిన అవసరం లేదు.. ఇది భారతదేశంలోనూ ఉన్నదే. రైతు అంటే పిల్లను ఇచ్చే వారు రోజురోజుకు తగ్గిపోతున్నారు. చిన్న ఉద్యోగం అయినా అది టౌన్ లో ఉండాలి.. అబ్బాయి అక్కడే ఉండాలి అనే ఆలోచన బలంగా ఉంది అమ్మాయిల్లో..  ఇది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని రైతు బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్య.