40 యేళ్లలో ఒకేఒక్కడు..ఆ రాజకుటుంబంలో 18 యేళ్లు నిండిన ప్రిన్స్

40 యేళ్లలో ఒకేఒక్కడు..ఆ రాజకుటుంబంలో 18 యేళ్లు నిండిన ప్రిన్స్

అది వెయ్యి సంవత్సరాలకు పైగా దేశాన్ని పరిపాలించిన రాజుకుటుంబం..ఇప్పుడు ఆ రాజవంశాన్ని వృద్ధాప్యం వెంటాడుతోంది.. గడిచిన 40 యేళ్లలో ఒకేఒక్కడు 18 యేళ్లు నిండిన మగపురుషుడు ఉన్నాడంటే..వృద్ధాప్యం ఎంతలా వెంటాడుతుందో చెప్పొచ్చు.. ఈ సమస్య ఒక్క రాజకుటుంబానిదే కాదు.. దేశం మొత్తానికి.. ఏదేశం అంటారా.. జపాన్.. ఈ దేశంలో వేగంగా వృద్ధాప్యం, జనాభా క్షీణిస్తుందట.

జపాన్ క్రౌన్ ప్రిన్స్ అకిషినో కుమారుడు ప్రిన్స్ హిసాహిటోకు శుక్రవారం (సెప్టెంబర్ 6, 2024 ) నాటికి 18 యేళ్లు నిండాయట. దీంతో హిసాహిటో జపాన్ ఇంపీరియల్ కు టుంబంలో చేరాడు. దీంతో 39 యేళ్ల తర్వాత హిసాహిటో యుక్త వయస్సుకు  చేరుకున్న ఆ రాజకుటుంబంలో మొదటి మగవాడిగా నిలిచాడు. 

ప్రిన్స్ హిసాహిటో..58యేళ్ల క్రౌన్ ప్రిన్స్ పుమిహిటో, 57 యేళ్ల క్రౌన్ ప్రిన్సెస్ కొకోకు ఏకైక కుమారుడు. హిసాహిటో జపనీస్ చక్రవర్తి నరుహిటో మేనల్లుడు. 1985లో యుక్త వయస్సుకు చేరుకున్న క్రౌన్ ప్రిన్స్ పుమిహిటో కుమారుడు.. అతని తర్వాత యుక్తవయస్సుకు వచ్చి సింహాసనం ఎక్కేందుకు వరసలో ఉన్న రెండో ప్రిన్స్ హిసా హిటో.