Human Washing Machine: శరీరం, మనస్సు రెండింటిని శుభ్రపరిచే.. హ్యూమన్ వాషింగ్ మిషన్ వచ్చేసింది.. ఫుల్ డిటెయిల్స్ ఇవిగో..

Human Washing Machine:  శరీరం, మనస్సు రెండింటిని శుభ్రపరిచే..  హ్యూమన్ వాషింగ్ మిషన్ వచ్చేసింది.. ఫుల్ డిటెయిల్స్ ఇవిగో..

బట్టలు ఉతికేందుకు వాషింగ్ మిషన్లను మనం చూశాం.. కానీ మనిషిని క్లీన్ చేసే వాషింగ్ మిషన్లను చూశారా.. హ్యూమన్ వాషింగ్ మిషన్ వచ్చేసింది. జపాన్ కు చెందిన ఇంజనీర్లు ఈ మెషిన్లను తయారు చేశారు. ఈ మానవ వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.. 

మిరాయ్ నింగెన్ సెంటకుకి పేరుతో హ్యూమన్ వాషింగ్ మెషీన్ ఆఫ్ ది ఫ్యూచర్ ను ఆవిష్కరించారు జపాన్ ఇంజనీర్లు.. ఇది AI, హైటెక్ వాట్ జెట్లతో కలయిక మనిషి పూర్తి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. దీంతో పాటు మనసును కూడా క్లీన్ చేస్తుందట ఈ AI వాషింగ్ మిషన్. 

ALSO READ | టెక్నాలజీ : పాన్ 2.0తో నకిలీకి చెక్.. ఆన్​లైన్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్​లు తగ్గే ఛాన్స్

ఈ మానవ వాషింగ్ మిషన్ ఒసాకా బేస్డ్ సైన్స్ కో చేత డెవలప్ చేయబడింది. ఈ వాషింగ్ మిషన్ కేవలం 15 నిమిషాల్లో వాష్ అండ్ డ్రై ప్రక్రియ ద్వారా కస్టమర్ శరీరాన్ని శుభ్రపరుస్తుంది.ఈ మెషీన్లో సున్నితమైన భాగాలను క్లీన్ చేసే పరిశ్రమ్లలో ఉపయోగించే చిన్న చిన్న గాలి బుడగలగల హైస్సీడ్ వాటర్ జెట్ లను ఉపయోగిస్తారట. 

ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్ లో అద్బుతమైన ఫీచర్ ఏంటంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్ .. కస్టమర్ ఎమోషనల్ స్టేటస్ అంచనా వేస్తుందట.. దీని ద్వారా ప్రశాంతం, ఓదార్పును అందిస్తుందట.