ఛీ..ఛీ.. ఏందిరా ఈ ఫుడ్​...చంకలో పెట్టి .. చెమటతో తయారీ..

ఈ వార్త చదివే వారికి ఒక సూచన.. తిన్న తరువాత వెంటనే ఈ వార్త చదవకండి.  ఒకవేళ అలా చేశారా వాంతులు కాయం. ఎలాగూ చదివిన తరువాత రెండు మూడు గంటల వరకు తినలేరనుకోండి.. అది వేరే విషయం. 

సాధారణంగా చెమటలు కక్కేవారు పక్కన ఉంటేనే అన్​ ఈజీగా ఫీలవుతాం.. కాని ఓ దేశంలో ఆ చెమటతో చిరుతిండ్లు తయారు చేస్తారట.  అక్కడి జనాలు లొట్టలేసుకొని మరీ తింటారట.. ఇంతకూ ఆ ఫుడ్​ ఏంటో  చూద్దాం. . .

సాధారణంగా కొందరిలో చెమట ఎక్కువగా వస్తుంది. దీంతో ఒళ్లంతా చెమటతో తడిసిపోతారు. మనకు కొద్దిగా చెమట వస్తేనే అస్సలు భరించలేము. చెమట వాసన నుంచి బైటపడాటానికి బాడీ స్ప్రెలు పలుమార్లు స్నానం చేస్తుంటాం. అయితే.. జపాన్ లో మాత్రం చెమట చేసిన డిష్ ను అక్కడ ఇష్టంతో తింటారు. అక్కడ దీనికి ఫుల్ డిమాండ్ కూడా ఉందని చెప్పుకుంటారు.

అందమైన అమ్మాయిలను అక్కడ హోటల్స్ లలో జాబ్ లకు పెట్టుకుంటారు. వారి పనికేవలం అక్కడ ఎక్సర్ సైజులు చేయాలి. చెమటలు కక్కుతుండాలి. ఇలా చెమటలు కక్కిన తర్వాత అక్కడి డిష్ ను వారి చెంకలో పెట్టి మరీ అద్దుతారు. ఇలా చేసిన డిష్ కు అక్కడ ఫుల్ డిమాండ్ అని చెబుతుంటారు.  .సంప్రదాయానికి ఆధునికత జోడించడంలో జపాన్ వాళ్లు సిద్ధహస్తులని చెబుతారు. వారి వంటకాల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తుంటుంది. అయితే, తాజాగా జపాన్‌లో (Japan) యువతుల చంకలోని చెమటతో చేసే ఓ ఫుడ్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అక్కడి వారు ఈ ఫుడ్‌ను ఎగబడి తింటుంటే.. విషయం తెలిసిన నెటిజన్లు (Viral) మాత్రం రోతపుడుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 ప్రపంచంలో జరుగుతున్న వింత-విచిత్ర సంఘటనలు నిత్యం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతూనే ఉంటున్నాయి. ఇలాంటిది కూడా ఉంటుందా? మనుషులు ఇలా కూడా ఉంటారా?  అని.. వాటిని చూస్తే డౌట్​ వస్తుంది. ఇక ఇప్పుడు.. జపాన్​కు చెందిన ఓ వార్తను విన్న వారందరు.. షాక్​ అవుతున్నారు. అక్కడి ప్రముఖ, ట్రెడీషనల్​ డిష్.. ఒనిగిరి అనే రైస్​ బాల్​​ని కొత్త విధానంలో తయారు చేయడం ఇందుకు కారణం..  కొత్తగా తయారు చేస్తే ఏముంది? అని అనుకుంటున్నారా? ఆ ఒనిగిరిని.. చంకలో పెట్టి, చెమటతో తయారు చేస్తుండటం ఇక్కడ అసలు విషయం. అంతేకాదు.. ఎంత ధర పెట్టినా, అక్కడి ప్రజలు వీటిని ఎగబడి మరీ కొంటున్నారట!  

జపాన్ లోని ఒనిగిరి అనేది ఒక సంప్రదాయ వంటకం.ఒనిగిరి అంటే అన్నం ముద్దలు. అయితే.. ఈ ఒనిగిరి ప్రిపరేషన్ స్టైల్ తెలిస్తే షాక్ అవుతారు. దీన్ని అందమైన అమ్మాయిల చంకనుంచి వచ్చే చెమటలో దీన్ని రుద్దుతారు. ఇలా రుద్దిన తర్వాత ఆ డిష్ ను అమ్మకానికి పెడుతారు. ఇక్కడ పనిచేసే అమ్మాయిలు ఎప్పుడు కూడా చెమటలు కారుస్తుంటారు. వీరు కార్చిన చెమటలో అన్నం ముద్దలను రుద్దుతారు. ఇలా రుద్దడం వల్ల ఆ చెమట నుంచి కొన్ని హర్మోన్ లు అన్నం ముద్దలలో వెళ్తాయంట. అవి తింటే లైంగిక సమస్యలు దూరమవుతాయంట. అంతే కాకుండా.. ఏజింగ్ సమస్యకూడా దరిచేరదంట. అందుకే జపాన్ లో చంకలోని చెమటతో తయారు చేసే డిష్ కు ఫుల్ డిమాండ్ అంట.  

జపాన్ లో కొందరు చెమటల నుంచి ఫెరామోన్స్ అనే ప్రత్యేక హర్మోన్ లు రిలీజ్ అవుతాయని,దీన్నిఅన్నం ముద్దలకు రుద్దడం వల్ల, ఇవి తిన్నవారిలో లైంగిక పరమైన ప్రాబ్లమ్స్ ఉంటే మానిపోతాయంట. ముఖ్యంగా పెళ్లైన జంటలు ఈ చంకలోని చెమట ముద్దలను ఇష్టంగా తింటారంట. ప్రస్తుతం ఈ  జపాన్ లోని డిష్ మాత్రం వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు ఇదేం డిష్ రా నాయన అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి పాడుపనులు చేస్తుండవల్లనే లేని రోగాలు, మందులు కూడా లేని రోగాలు వ్యాపిస్తున్నాయని అంటున్నారు. కొందరు ఈ ఘటన చూసి ఇదేం విడ్డూరం ఛీ .. ఛీ.. అంటూ కూడా స్పందిస్తున్నారు.  ఏదేమైనప్పటికీ జపాన్‌ ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్న ఈ వంటకం నెట్టింట మాత్రం విమర్శల పాలవుతోంది.