అవునా.. నిజమా : జపాన్ వాళ్లు ఉదయం స్నానం చేయరా.. సాయంత్రమే చేస్తారా.. ఎందుకిలా....?

అవునా.. నిజమా : జపాన్ వాళ్లు ఉదయం స్నానం చేయరా.. సాయంత్రమే చేస్తారా.. ఎందుకిలా....?

మన దగ్గర పొద్దున్నే స్నానం చేసిడ్యూటికి వెళ్తుంటారు. అలాగే సాయంత్రం చేసేవాళ్లు కూడా ఉంటారనుకోండి. జపాన్లో మాత్రం రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తారు. పొద్దున లేచి ఇంటి పనులు చేసుకొని బయటకు వెళ్తుంటారు.. జ‌పాన్ లో ఉన్న ఈ భిన్న‌మైన క‌ల్చ‌ర్ వెనుక ఉన్న కార‌ణం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే..

జ‌ప‌నీస్ పబ్లిక్ బాతింగ్ ఇష్టపడతారు. అందుకే ఆ దేశంలో ఎక్కడ చూసినా పబ్లిక్ బాతింగ్ సౌకర్యాలు (సెంటోస్) ఉంటాయి. వయసు, జెండర్ తో సంబంధం లేకుండా ఎవరైనా ఈ సెంటోస్ ని వాడుకోవచ్చు. మన దగ్గర నదులూ, చెరువులో స్నానాలు చేసినట్టుగానే పూర్వకాలంలో జపాన్లో హాట్ స్ప్రింగ్స్.. పబ్లిక్ బాతింగ్ ఫేస్ లుగా ఉండేవి. ఇప్పటికీ చలికాలంలో వాళ్లు హాట్ స్ప్రింగ్స్ కి వెళ్తుంటారు. 

ఇలా అందరూ కలిసి స్నానం చేయడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అక్కడి వాతావరణం కాగా, చిన్న ఇళ్లలో అన్ని రకాల సౌకర్యాలు లేకపోవడం మరో కారణం. జపాన్లో వాతావరణం తీవ్రంగా ఉంటుంది. చలికాలంలో వెన్ను గడ్డ కట్టేటంత దలి, ఎండాకాలంలో తట్టుకోలేనంత వేడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రిలాక్స్ అవుదాం అంటే అక్కడి ఇళ్లు చాలా చిన్న‌గా ఉండటలతో తగిన సౌకర్యాలు ఉండవు. అందుకే సెంటోస్ కి వెళ్తుంటారు. సెంటోస్ లో పూల్స్, షవర్స్, బాత్ టబ్స్ తో పాటు స్నానానికి అవసరమైన సబ్బులు, షాంపూలు ఉంటాయి. కొన్ని డబ్బులు చెల్లిస్తే చాలు, బాతింగ్ ఫెసిలిటీస్ ని ఎంజాయ్ చేయొచ్చు. తీరిగ్గా రిలాక్స్ అవ్వొచ్చు. పగలంతా ప‌ని చేసి వస్తారు కాబట్టి, ఇక రిలాక్స్ కావడానికి సాయంత్రానికి మించిన టైం ఏం ఉంటుంది? 

సంప్రదాయం

 షింటో నమ్మకాలు, ఆచారాలతో జ‌పాన్ క‌ల్చ‌ర్ రూపుదిద్దుకుంది. మనం షింటో పుణ్యక్షేత్రానికి వెళితే, కచ్చితంగా చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోమని సూచిస్తారు. అది అక్కడి ఆచారం. ఇలా చేయడం వల్ల శరీరంతోపాటు అత్మ‌ కూడా శుద్ధి అవుతుందని వాళ్ల నమ్మకం. అద్దం మీద దుమ్ము తుడిచినట్టుగానే.. స్నానం చేయడం వల్ల అత్మ శుద్ది అవుతుందని జెన్ బుద్ధిజం చెబుతోంది. షింటోయిజం పురాణాల్లో కూడా సాయంత్రం స్నానం చేయాలనే నియమాలు ఉన్నాయి. చంద్ర దేవుడైన సుకుయోమినో మికొలో చుక్కలకు రాజు, అతని తండ్రి ఇరాగినో మికొలో తన భార్య చనిపోయినప్పుడు కోపంతో రాత్రి స్నానం చేస్తాడు. అప్పుడు చంద్రుడు పుడతాడు. రాత్రిస్నానం చేస్తే చంద్రదేవుని ఆశీస్సులు ఉంటాయనీ నమ్ముతారు. కొంతమంది రాత్రుళ్లు జలపాతాల కింద స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పుణ్యం వస్తుందని నమ్ముతారు. 

మన దగ్గర పొదున స్నానం చేయకుండా వర్క్ ప్లేస్ కి వెళితే అగౌరవంగా చూస్తారు. ఈ కల్చ‌ర్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చింది. ఇది జపాన్ కు కూడా కూడా పాకింది. జ‌ప‌నీస్ అనగానే వాళ్ల టైమ్ పంక్చువాళ్టీ గురించి అంతా మాటాడుకుంటారు. భయంకరమైన వాతావరణంలోనూ జపనీస్ ప‌గలంతా తీవ్రంగా కష్టపడుతుంటారు. దాంతో సాయంత్రం ఇంటికి వచ్చి రిలాక్స్ కావడం అనేది వాళ్ల జీవితంలో ఒక భాగమైంది. అయితే. నీళ్లలో కూడా కొంతమంది పొద్దున గజగజ స్నానం చేసి ఆఫీస్ కి వెళ్తారు. కానీ, సాయంత్రం నిద్రపోవడానికి ముందు రిలాక్స్ డ్  గా స్నానం చేస్తారు. జపాన్లో అయిజు బంష‌డాయి సన్' అనే ఓ పాత జానపదం ఉంది. ఒషారా అనే ఒక మనిషి పొద్దున్నే స్నానం చేయడం, పొద్దున పూటే తాగడం, నిద్ర‌పోవడం వల్ల పేదవాడిగా మారిపోతాడు' అని ఆ జానపద కథ సారాంశం. దీన్ని బట్టి వేల ఏళ్లుగా జపాన్లో నిద్రపోవడానికి ముందు స్పానం చేసే కల్చర్ ఉందని అర్థమవుతుంది. 

ALSO READ : Good Health : ఈ చేపనూనెతో ఫెర్టిలిటీ సమస్యలు దూరం.. సామర్ధ్యం పెరుగుతుందంట..!

అలిసిపోతే 

నిజానికి మన దేశానిది కూడా సాయంత్రం స్నానం చేసే కల్చ‌రే! ఊళ్లల్లో పొద్దున పనికి వెళ్లి తిరిగి సాయంత్రం అలిసిపోయి చెమటతో వస్తారు. కాబట్టి, సాయంత్రమే స్నానాలు చేసేవాళ్లు. ఇప్పటికీ గ్రామాల్లో రైతులు వ్యవసాయంతో సంబంధం ఉన్నవాళు సాయంత్రమే స్నానం చేస్తుంటారు.. ఆఫీస్ కల్చర్ వచ్చాక, పొద్దున పని మొదలు పెట్టే ముందు రిఫ్రెష్ గా ఉండాలనే ఉద్దేశంతో పొద్దున్నే స్నానం చేయడం అలవాటు చేసుకున్నారు. అయితే, కొంతమంది రోజుకు రెండుసార్లు స్నానం చేస్తారు.