ఉద్యోగులు సిగరెట్ తాగాలంటే ఏం చేస్తారు? బయటికి వెళ్లి ఒక దమ్ము లాగిస్తారు. దానికి ఒకటి, రెండు నిమిషాలైతే వెళ్లరు కదా... కనీసం పావుగంటైనా వెళ్తారు. అలా రోజుకు నాలుగైదుసార్లు వెళ్తే ఏంటి పరిస్థితి? యాజమాన్యం ఊరుకుంటుందా? కొందరైతే వెంటనే సస్పెండ్ చేస్తారు. మరికొందరు ఒకటి. రెండుసార్లు వార్నింగ్ ఇస్తారు. మూడోసారీ ఇలాగే జరిగితే అప్పుడు జాబ్లో నుంచి తీసేస్తారు. అంతేకానీ, సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం, తాగడం మానేయండి' అని చెప్తారా? అది జరగని పని అనుకుంటున్నారా! ఇలా చెప్పడమే కాదు... తాగడం మానేస్తే ఇన్సెంటివ్స్ కూడా ఇస్తోంది జపాన్కు చెందిన 'పియాలా ఇంక్...' అనే కంపెనీ..
టోక్యో సై సేవర్ సెంటర్లో.. 29వ అంతస్తులో ఉంటుంది పియాలా కంపెనీ ఆఫీసు అక్క డికి వెళ్లే అందరూ శ్రద్ధగా పని చేసుకుంటూ ఉంటారు. అప్పడప్పుడు మాత్రమే ఒకరెద్దను సిలోంచి లేస్తారు. ఇప్పుడంటే ఇలా ఉంది కానీ, ఒకప్పుడు పరిస్థితి దారుణంగా ఉండేది. ఆఫీసులో సగానికి పైగా ఉద్యోగులు.. సిగరెట్ తాగడానికి బయటికి వెళ్తుండే వాళ్లు ఒక్కొక్క రు రోజులో మూడు, నాలుగుసార్లు పావుగంటు పాటు హ్యాకింగ్ కోసం బ్రేక్ తీసుకునేవాళ్లు.
ఈ విషయం యజమాన్యం దాకా వెళ్లింది. అయినా వాళ్లు అందరిలా స్పందించలేదు. ఏ ఒక్క ఉద్యోగిని పిలిచి తిట్టలేదు. ఉద్యోగంలో నుంచి తొలగించలేదు. పైగా ఉద్యోగుల ఆరోగ్యం గురించే ఆలోచించింది. అందుకే ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదే ఆరు రోజుల అదనపు సెలవులు.ఒక ఉద్యోగి సిగరెట్ తాగడం మానేస్తే అంటే ఆఫీసులో తీసుకునే బ్రేక్ టైమ్ తగ్గిస్తే ఈ ఆఫర్ అమలు చేస్తారు. ఏడాదికి అందరితో పాటు ఉండే సెలవులకు అదనంగా మరో ఆరు రోజులు వాళ్లు సెలపులు తీసుకోవచ్చు.
మానేసే వాళ్లు పెరిగారు:
ఈ ఆఫర్ ప్రకటించిన తర్వాత చాలామంది ఉద్యోగుల్లో మార్పు కనిపించింది. మొదట్లో ఒకటి, రెండుసార్లు బ్రేక్ తీసుకున్న తర్వాత స్మోకింగ్ ను మావేయడం మొదలుపెట్టారు. ఒకర్ని చూసి ఇంకొకరు. మొత్తంగా నలుగురు ఉద్యోగులు సిగరెట్ ను పూర్తిగా మానేశారు. అలా మానేయడం తమ ఆరోగ్యానికి కాదు చుట్టూ ఉండే వాళ్ల ఆరోగ్యానికీ తోడ్పడుతుంది కదా" అన్నాడు పియాలా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'టకావ్ అనుకా' తమలాగే పెనాలిటీలు లేకుండా ఇన్సెంటిన్స్ ఇవ్వడం వల్ల కొంతలో కొంతైనా దూమపానాన్ని అరికట్టోచ్చు అంటోంది కంపెనీ చూజమాన్యం 'ఎప్పటికైనా ఉద్యోగస్తుల ఆరోగ్యమే మాకు ముఖ్యం ఈ కంపెనీ.
== వెలుగు లైఫ్