నారాయణపేట, వెలుగు: పట్టణంలోని శక్తి పీఠం ఆధ్వర్యంలో చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను చూసి ఆకర్షితులైన జపాన్ భక్తురాలు అయానా పిమ్మట శుక్రవారం నారాయణపేట శక్తి పీఠాన్ని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం శక్తి పీఠం ఆవరణలోని ఆలయాలు, శక్తి పీఠం అన్నపూర్ణేశ్వరి నిత్యాన్నదాన సత్రం, సురభి గోశాల, శారద కల్యాణ మండపాన్ని పరిశీలించారు.
శక్తి పీఠం చేస్తున్న వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు తాను ఆకర్షితురాలైనట్లు చెప్పారు. శక్తి పీఠం ట్రస్ట్ సభ్యులతో పాటు అన్నపూర్ణేశ్వరి నిత్యాన్నదాన సత్రం కమిటీ సభ్యులను ఆమె అభినందించారు. అనంతరం శక్తిపీఠం వ్యవస్థాపకులు స్వామి శాంతనంద్ పురోహిత్ ఆశీస్సులు తీసుకున్నారు.