- శునకంగా మారిపోయిన జపాన్ వాసి
- తన కలను నేర్చుకునేందుకు రూ.12 లక్షల ఖర్చు
- వేషధారణను సమకూర్చిన జెప్పెట్ సంస్థ
- వైరల్ అవుతోన్న అచ్చ శునకంలాగే ఉన్న టోకో వీడియో, ఫొటోలు
మనిషి.. జంతువు పరిణామ క్రమం నుంచి అభివృద్ధి చెందాడు అని చెప్పడం వింటూనే ఉంటాం. అలాంటిది ఓ మనిషి... జంతువులా మారిపోతే ఎలా ఉంటుందో ఊహించారా .. ? అవును మీరు వింటున్నది నిజమే. జపాన్ కు చెందిన ఓ వ్యక్తి జంతువులా మారాలన్న తన జీవితకాల కలను తీర్చుకొని సంబరపడిపోతున్నాడు. ఈ విషయాన్ని స్వయానా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో ఫొటోలను షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఇక వివరాల్లోకి వెళితే.. జపాన్ కు చెందిన ప్రముఖ వార్తా ఏజెన్సీ న్యూస్. మైనవి ప్రకారం జెప్పెట్ అనే సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాలు లాంటి తదితర అవసరాల కోసం పెద్ద ఎత్తున వాటికి కావాల్సిన శిల్పాలను, అద్భుత ఖండాలను రూపొందించిడమే కాకుండా, కాస్ట్యూమ్ ను కూడా అందజేస్తోంది. అత్యంత ఆదరణ పొందిన మస్కట్ అనే పాత్రకు దుస్తులను కూడా రూపొందిస్తూ.. ఎంతో పేరును సంపాదించింది. అయితే అప్పటికే తాను శునకంగా కనిపించాలనే ఆలోచనతో ఉన్న టోకో ఇవీ... ఈ సంస్థ గురించి తెలిసి.. వారిని సంప్రదించాడు. తన కలను జెప్పెట్ సంస్థకు తెలియజేశాడు. దాని కోసం తాను ఎంత ఖర్చునైనా భరిస్తానని చెప్పడంతో... ఇంకేముంది ఆ సంస్థ.. అతని కలను నెరవేర్చేందుకు పూనుకొని, అందుకు తగిన పనులను చేపట్టింది.
ఇక జెప్పెట్ సంస్థకు చెందిన కళాకారులు దాదాపు 40 రోజులు ఎంతో కష్టపడి టోకో ఇవీకి శునకంలా కనిపించేందుకు కావల్సిన దుస్తులను తయారు చేశారు. వారు రూపొందించిన దుస్తులతో ఫైనల్ గా టోకోను కోలీ జాతికి చెందిన శునకంగా మార్చి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ అందరూ విస్తుపోయే మరో విశేషమేమిటంటే మేకప్, ఇతర ఖర్చుల కోసం ఇవీకి రూ.12లక్షలయిందట. ఈ విషయాన్ని కూడా టోకి వెల్లడించారు. ఏదైతేనేమీ.. తాను కలగన్న కలను ఈ విధంగా తీర్చుకొని.. సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఇవీ. చూడడానికి ఇన్నోసెంట్ గా, చెప్తేగానీ మనిషేనని గుర్తు పట్టలేనంతగా ఉన్న ఈ శునకం వేషధారణ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కేవలం శునకం తరహా వేషం కోసం 12 లక్షలు ఖర్చు చేసిన టోకో.. అసలు ఎలా ఉంటాడా అని మాత్రం ఇప్పటికీ తెలిసిరాలేదు. ఇకపోతే మీక్కూడా ఆ శునకం ఎలా ఉంది.. ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చింది అనే విషయాలను చూడాలంటే వెంటనే.. టోకో తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసుకున్న ఈ వీడియోను చూసి మురిసిపోండి.