- స్కూళ్లు, ఆలయాల పరిశీలన
- సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుని ఆనందించిన జపాన్ యువత
కౌడిపల్లి, వెలుగు: జపాన్ కు చెందిన సుజుకి సంస్థ విద్యార్థుల టీమ్ సోమవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బుజిరంపేటలో పర్యటించింది. సంస్థ అధ్యక్షురాలు రమాదేవి, రాఖీతో పాటు మరో పదకొండు మంది యువకులు గ్రామంలో తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. ప్రజల జీవనం, సంస్కృతి, సంప్రదాయాలను అడిగి తెలుసుకుని ఆనందించారు. ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు, ఇబ్బందులపై అడగగా.. గ్రామ కార్యదర్శి రాజిరెడ్డి వివరించారు.
అనంతరం హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. ముందుగాజపాన్ బృందానికి గ్రామస్తులు డీజేలతో ఘన స్వాగతం పలికారు. గ్రామపెద్దలు, యువకులు, చిన్నారులతో కలిసి డ్యాన్స్చేసి సందడి చేశారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. డ్వాక్రా సంఘం సభ్యులు లలిత, సబితా, నాయి కోటి లింగం తదితరులు ఉన్నారు.