కారు ఎగిరింది

కారు ఎగిరింది

ఈ మధ్య అప్పుడప్పుడు ఎగిరే ట్యాక్సీల గురించి చర్చ జరుగుతూనే ఉంది. కొన్ని కంపెనీలు ప్రొటోటైప్ లనూ విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు అదే జాబితాలో జపాన్ కంపెనీ కూడా చేరిపోయింది. కాకపోతే ఇది ట్యాక్సీ కాదు… కారు. ఎగిరే కారు. ఎలక్ట్రా నిక్స్​ను తయారు చేసే ఎన్ ఈసీ కార్ప్ అనే సంస్థ దీనిని తయారు చేసింది. దీనికుండే నాలుగు ప్రొపెల్లర్లు కారును ఎగిరేలా చేస్తాయి. సోమవారం టోక్యోలోని ఎన్ ఈసీ ఆఫీసు పరిసరాల్లో దీనిని టెస్ట్​ చేశారు. 10 అడుగుల ఎత్తు వరకు వెళ్లిన ఇది, నిమిషం పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. 2030కల్లా ఎగిరే కార్లను అందుబాటులోకి తీసుకు రావాలని జపాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నే 2017లో కార్టివేటర్ అనే సంస్థ ఓ ఎగిరే కారును తయారు చేసింది. దానిని టెస్టు చేస్తుండగా కొద్ది సేపటికే కూలిపోయింది. కార్టివేటర్ కు స్పాన్సర్ చేస్తున్న 80 కంపెనీల్లో ఎన్ ఈసీ కూడా ఒకటి.