ప్రైవేట్ రంగం నుంచి ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టాలని జపాన్ చేసిన తొలి ప్రయత్నం విఫలమైంది. జపాన్ కంపెనీ స్పేస్ వన్ ప్రారంభ రాకెట్ కైరోస్ ప్రయోగం బుధవారం ( మార్చి 13) విఫలమైంది. ప్రయోగం మొదలుపెట్టిన సెకన్లలో రాకెట్ పేలి పోయింది. పశ్చిమ జపాన్ లోని వాకయామా ప్రిఫెక్చర్ లోని లాంచ్ సైట్ లో బుధవారం ఉదయం 7.30 గంటలకు కైరోస్ రాకెట్ ను ప్రయోగించారు. 18 మీటర్ల పొడవున్న ఈ రాకెట్.. నాలుగు దశల ఘన ఇంధన రాకెట్. ఇది లేకాఫ్ అయిన తర్వాత పొగ , మంటలు చెలరేగి ఆకాశంలో పేలిపోయింది.
అయితే స్పేస్ రాకెట్ విఫలంపై జపాన్ కంపెనీ స్పందించింది. ఉద్దేశపూర్వకంగానే కైరోస్ రాకెట్ ను కూల్చివేసినట్లు ప్రకటించింది. 2018లో స్థాపించబడిన ఈ స్పేస్ వన్ సంస్థ .. 2020 నాటికి 20 వార్షిక ప్రయోగాలతో స్పేస్ కొరియర్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ తెలిపింది.
వరుస అంతరిక్ష ప్రయోగాలతో భారత్, అమెరికా, రష్యా, చైనా లతో పాటు జపాన్ అంతరిక్ష పోటీలో దూసుకుపోతుంది. ఫిబ్రవరిలో జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ఫ్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) తన ప్లాగ్ సిప్ రాకెట్ H3 విజయవంతంగా ప్రయోగించింది. 2023 నాటికి 20 ఉపగ్రహాలు, ప్రోబ్స్ లాంచ్ లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో పిన్ పాయింట్ మూన్ ల్యాండింగ్ లక్ష్యంగా పెట్టుకుంది జపాన్ స్పేస్ ఏజెన్సీ.
Japan’s Space One rocket exploded on its inaugural flight
— Daily News Dispatch (@DailyDispatchIn) March 13, 2024
The 18-meter solid-fuel rocket ignited seconds after lifting off leaving behind a large cloud of smoke, a fire, debris, and firefighting water sprays near the launch pad, visible on local media livestreams. pic.twitter.com/duKOFRn6nq