ఒకే గ్రామం.. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు!

దమ్మపేట, వెలుగు : ఒకే గ్రామం.. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు, అదే గ్రామానికి చెందిన జారే ఆదినారాయణ కాంగ్రెస్​ నుంచి టికెట్​ దక్కించుకున్నారు. ఒకరు ఖమ్మం, మరొకరు అశ్వారావుపేట స్థానాల నుంచి పోటీ చేశారు. ఇద్దరూ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.