మోదీజీ దండం పెట్టి అడుగుతున్నా..

మోదీజీ దండం పెట్టి అడుగుతున్నా..
  • 1.36 లక్షల కోట్ల బకాయిలివ్వండి: సీఎం హేమంత్ సోరెన్ 

రాంచీ: తమ రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ. 1.36 లక్షల కోట్ల బొగ్గు బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్రానికి జార్ఖండ్‌‌ సీఎం హేమంత్ సోరెన్ విజ్ఞప్తి చేశారు. బకాయిలను క్లియర్  చేయకపోవడం వల్ల జార్ఖండ్ అభివృద్ధి కుంటుపడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన రూ. 1.36 లక్షల కోట్లు వెంటనే ఇవ్వాల్సిందిగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాకి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నానని హేమంత్ సోరెన్ తెలిపారు. ఈ సమస్యను సోరెన్ ఎక్స్ వేదికగా ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. " ప్రధాని, కేంద్ర హోంమంత్రి జార్ఖండ్‌‌కు వస్తున్నారు. అందువల్ల రాష్ట్రానికి 1.36 లక్షల కోట్ల రూపాయల బకాయిలు (బొగ్గు బకాయిలు) క్లియర్ చేయాలని నేను వారిని చేతులు జోడించి మరోసారి అభ్యర్థిస్తున్నాను" అని సోరెన్ ట్వీట్ చేశారు.