టూల్స్​ గాడ్జెట్స్​ : ఫింగర్​ ప్రింట్​ డోర్​​ లాక్​

టూల్స్​ గాడ్జెట్స్​ : ఫింగర్​ ప్రింట్​ డోర్​​ లాక్​

ఫింగర్​ప్రింట్​​​తో ఫోన్​ని అన్​లాక్​ చేయడం మామూలే. కానీ.. ఇప్పుడు ఇంటికి వేసిన తాళాన్ని కూడా తెరవొచ్చు. జాసిఫ్స్​ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ స్మార్ట్ లాక్​ని ఫింగర్ ప్రింట్​తో అన్​లాక్​ చేయొచ్చు. దీన్ని తెరవాలంటే మిగతా స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాక్​ల్లా బ్లూటూత్, యాప్, కీ లాంటివేవీ అవసరం లేదు. మతిమరుపు ఉన్నవాళ్లకు ఇది బాగా పనికొస్తుంది. రిజిస్టర్డ్ ఫింగర్ ప్రింట్లతో మాత్రమే దీన్ని అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాక్ చేయొచ్చు. ఇందులో అడ్వాన్స్​డ్​ ఫింగర్​ప్రింట్​ డిటెక్షన్​ టెక్నాలజీని వాడారు.

కేవలం 0.5 సెకన్లలో అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాక్ అవుతుంది. పది వేలిముద్రలను స్టోర్​ చేసుకోగలదు. ఇందులో రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. గంటసేపు చార్జింగ్​ పెడితే.. 9,000 కంటే ఎక్కువ సార్లు అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు. అంటే దాదాపు 6–12 నెలల వరకు మళ్లీ చార్జింగ్​ పెట్టాల్సిన అవసరమే ఉండదు. ఇందులో ఎల్​ఈడీ బ్యాటరీ ఇండికేటర్​ కూడా ఉంటుంది. చార్జింగ్​ తగ్గితే.. ఇండికేషన్​ చూపిస్తుంది. దీన్ని ఇంటికే కాదు.. సూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేసులు, గోల్ఫ్ బ్యాగులు, హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాగులు, అల్మారాలు, సైకిళ్లకు కూడా వేసుకోవచ్చు.  

ధర : రూ. 1,299

వార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోబ్​ లాక్​ 

కొన్నిసార్లు వార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోబ్​, టేబుల్​ డ్రాయర్​కు లాక్​లు వేసి తాళంచెవి ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం. అందులోని వస్తువులతో అవసరం వచ్చినప్పుడు కంగారు పడిపోతుంటాం. కానీ.. ఈ లాక్​ ఉంటే ఆ సమస్యే ఉండదు. సింపుల్​గా కీ​కి బదులు బయోమెట్రిక్​తో డ్రాయర్ లేదా వార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోబ్ తెరవొచ్చు. దీన్ని ఎస్కోజోర్​ అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఇందులో మూడు ఏఏఏ బ్యాటరీలు వేయాల్సి ఉంటుంది. అవి దాదాపు 5 వేల సార్లు అన్​లాక్​ చేసేవరకు పనిచేస్తాయి. తర్వాత బ్యాటరీలను రీప్లేస్​ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లాక్​ వేసిన తర్వాత బ్యాటరీలు డిస్​చార్జ్​ అయితే.. లాక్​కి మైక్రో యూఎస్​బీ ద్వారా పవర్​ అందించి ఎమర్జెన్సీ అన్​లాక్​ చేయొచ్చు. 

ధర : రూ. 1,599

స్మార్ట్ బ్యాక్​ప్యాక్​

చాలామంది సమ్మర్​ రాగానే టూర్లకు ప్లాన్లు రెడీ చేసుకుంటారు. అయితే.. అలా టూర్లకు వెళ్లినప్పుడు ముఖ్యమైన వస్తువులను చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. అందుకోసం ఈ బ్యాగ్​ బాగా ఉపయోగపడుతుంది. యాక్సీ అనే కంపెనీ దీన్ని మార్కెట్​లో అమ్ముతోంది. ఇది ఫింగర్​ప్రింట్​ సెన్సర్​తో వస్తుంది. ఈ బ్యాగ్ తెరుచుకోవాలంటే ఫ్రింగర్​ప్రింట్​తో అన్​లాక్​ చేయాలి. సెన్సర్​ గరిష్టంగా 10 వేళ్ల ముద్రలను గుర్తుంచుకోగలదు. దీన్ని యూఎస్​బీతో చార్జ్​ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జ్​ చేస్తే 1,000 సార్లు అన్​లాక్​ అవుతుంది. ఈ బ్యాగ్​ని 300D పాలిస్టర్​తో తయారుచేశారు. చాలా మందంగా ఉంటుంది. పైగా వాటర్​ ఫ్రూఫ్​తో వస్తుంది. 

ధర : రూ 5999