
భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియా డేటింగ్ చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి స్టేడియంలో సందడి చేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం (మార్చి 4) జరిగిన సెమీ ఫైనల్లో ఆమె తళుక్కున మెరిసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో జాస్మిన్ టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ కు ఫిదా అయిపోయింది. పాండ్య కొట్టిన 101 మీటర్ల సిక్సర్ కు ఆమె సంతోషంతో గంతులు వేస్తూ కనిపించింది. చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన పాండ్యాకు ఆమె స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది.
జాస్మిన్ తన స్నేహితులతో కలిసి VIP లాంజ్‌లో కూర్చుని మ్యాచ్ ఎంజాయ్ చేసింది. స్ట్రాపీ బ్లూ డ్రెస్, హూప్ చెవిపోగులతో ఆకట్టుకుంది. పాండ్యా, జాస్మిన్ ఇద్దరూ కూడా తమ రిలేషన్ షిప్ పై వస్తున్న వార్తల గురించి నోరు విప్పలేదు. వీరిద్దరూ మరోసారి కనిపించడంతో సందడి సోషల్ మీడియాలో ఆమె స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ లో పాండ్య ఒత్తిడిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో జంపా బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ ను వన్ సైడ్ చేశాడు. ఓవరాల్ గా 24 బంతుల్లో 28 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దూసుకెళ్లింది.
భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియా డేటింగ్ చేస్తున్నట్లు 2024 ఆగస్టు లో వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ దిగిన ఫోటో లొకేషన్ ఒకటిగా ఉండడంతో ఈ చర్చ మొదలైంది. దీనికితోడు వీరిద్దరూ ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అనుసరించడంతో వీరి బంధం నిజమన్న వార్తలు గప్పుమన్నాయి.హార్దిక్ పాండ్యా శరీరంపై బయటకు కనిపించేలా రకరకాల టాటూలు ఉంటాయన్న విషయం విదితమే. పాండ్యా ఎడమ చేతిపై బిలీవ్ అనే పదాన్ని టాటూగా వేయించుకోగా.. భుజంపై ధైర్యానికి చిహ్నామైన టైగర్ బొమ్మను టాటూగా వేయించుకున్నాడు. ఇక, ఎడమ భుజంపై కుమారుడు అగస్త్య పుట్టినరోజును జ్ఞాపకంగావేపించుకున్నాడు. ఈ టాటూనే అతని చీకటి బాగోతాన్ని బయటపెట్టింది.
Hardik Pandya's girlfriend Jasmin walia reaction on hardik's two back to back Six 😍#INDvsAUS pic.twitter.com/CyoYtk3C7M
— Jeet (@JeetN25) March 4, 2025