Pakistan Cricket: పాకిస్థాన్ వైట్ బాల్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్

Pakistan Cricket: పాకిస్థాన్ వైట్ బాల్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ  ఫాస్ట్ బౌలర్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిల్లెస్పీని వన్డే, టీ20 ఫార్మాట్ లకు కెప్టెన్ గా ప్రకటించింది. అతను గ్యారీ కిర్‌స్టెన్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తాడు. ప్రస్తుతం పాకిస్థాన్ టెస్ట్ కోచ్ గా గిలెస్పీ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే అతను కోచ్ ఇంగ్లాండ్ పై పాకిస్థాన్ 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. మరో వారంలో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ వన్డే, టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. దీంతో గిలెస్పీ ఆస్ట్రేలియా కావడంతో అతడి అనుభవం పనికి వస్తుందని పాక్ క్రికెట్ బోర్డు భావించినట్టు సమాచారం. 

పాకిస్థాన్ వన్డే, టీ20 జట్ల ప్రధాన కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా చేశారు. ఏప్రిల్ 2024లో రెండేళ్ల కాంట్రాక్ట్‌పై పీసీబీచే నియమించబడిన కిర్‌స్టన్.. కేవలం ఆరు నెలలు మాత్రమే పాక్ జట్టులో కొనసాగారు. గ్యారీ కిర్‌స్టెన్‌ కోచ్ గా భారత్ 2011 లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. పాక్ కోచ్ గా మాత్రం అతనికి చేదు జ్ఞాపకాలు మిగిల్చాయి. ముఖ్యంగా 2024 టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే  నిష్క్రమించింది.
 
ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ జట్టుపై నవంబర్ 4 నుండి 18 వరకు వన్డే, టీ20 సిరీస్ లు ఆడనుంది. ఈ టూర్‌లో ఇరు జట్ల మధ్య మొదట వన్డే ఆ తర్వాత టీ20 సిరీస్ జరగనుంది. మూడు వన్డేలు వరుసగా నవంబర్ 04, 08,10 తేదీలలో జరుగుతాయి. నవంబర్ 14, 16, 18 తేదీలలో వరుసగా మూడు టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి.