ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆల్ రౌండర్లు రవి చంద్రన్ అశ్విన్. రవీంద్ర జడేజా తమ స్థానాలను నిలుపుకున్నారు. జడేజా 444 రేటింగ్ పాయింట్లతో టాప్ లో కొనసాగుతూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 322 రేటింగ్ పాయింట్లతో అశ్విన్ రెండో స్థానంలోనే ఉన్నాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ సౌతాఫ్రికాపై జరిగిన టెస్టులో అద్భుతంగా రాణించి.. రెండు స్థానాలను ఎగబాకి 5 వ స్థానానికి చేరుకున్నాడు. భారత మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఆరో స్థానంలో ఉన్నాడు.
బౌలింగ్ విషయానికి వస్తే టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ (870) తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బుమ్రా (847) మూడో స్థానంలో.. జడేజా(788) ఏడో స్థానంలో ఉన్నారు. టీమ్స్ లో ఆస్ట్రేలియా (124) అగ్ర స్థానంలో.. ఇండియా(120) రెండో స్థానంలో ఉన్నాయి. బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు.
ప్రస్తుతం రూట్ ఖాతాలో 872 రేటింగ్ పాయింట్స్ ఉండగా విలియంసన్ కు 859 పాయింట్స్ ఉన్నాయి. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో రూట్ సత్తా చాటాడు. ప్రస్తుతం శ్రీలంక, ఇంగ్లాండ్ ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరుగుతున్నాయి. ఈ సిరీస్ ల ఫలితాలని బట్టి ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉంది.
Jason Holder climbs up in the latest ICC Men’s Test All-Rounders Rankings 🧗♀️#ICCRankings | More ➡️ https://t.co/GYym77xqeK pic.twitter.com/wUt2QlyApA
— ICC (@ICC) August 21, 2024