2024 టీ20 వరల్డ్ కప్ కు వెస్టిండీస్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్న మరో దేశం అమెరికా. జూన్ 2 నుంచి 29 వరకు ఈ పొట్టి సమరం జరగనుంది. ఈ టోర్నీలో వెస్టిండీస్ టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. స్వదేశంలో వరల్డ్ కప్ జరగడం.. ప్లేయర్లందరూ ఫామ్ లో ఉండడం.. బిగ్ హిట్టర్లు.. ఆల్ రౌండర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జట్ల కంటే విండీస్ జట్టు బలంగా కనిపిస్తుంది. అయితే ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యాడు.
కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో వోర్సెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు హోల్డర్‌కు గాయమైంది. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ అధికారికంగా ధ్రువీకరించింది. హోల్డర్ ఎప్పుడు కోలుకుంటాడో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ కారణంగానే హోల్డర్ వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. హోల్డర్ లాంటి అనుభవజ్ఞుడు లేకపోవడం మాకు ఖచ్చితంగా లోటేనని.. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా అని చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ చెప్పుకొచ్చాడు.
Also Read:ఇటలీ తరుపున ఆడనున్న ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్
హోల్డర్ స్థానంలో లెఫ్టర్మ్ ఫాస్ట్ బౌలర్ ఒబెడ్ మెక్‌కాయ్ ను క్రికెట్ వెస్టిండీస్ ఎంపిక చేసింది. 15 మంది స్క్వాడ్ ను ఇదివరకే ప్రకటించగా తాజాగా ఐదుగురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా సెలక్ట్ చేసింది. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ తమ తొలి మ్యాచ్ ను జూన్ 2న పాపువా న్యూ గినియాతో ఆడనుంది.
వెస్టిండీస్ వరల్డ్ కప్ జట్టు 2024:
రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, షాయ్ హోప్, ఆండ్రీ రస్సెల్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెక్‌కాయ్, అకేల్ హోసేన్, గుడాకేష్ మోతీ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్
రిజర్వ్ ప్లేయర్స్:
కైల్ మేయర్స్, మాథ్యూ ఫోర్డ్, ఫాబియన్ అలెన్, హేడెన్ వాల్ష్, ఆండ్రీ ఫ్లెచర్
Jason Holder ruled out of the 2024 T20 World Cup.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024
- Obed McCoy has replaced him. pic.twitter.com/Z84Sw6UhUj