ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు షాకిచ్చాడు. వ్యక్తిగత కారణాల రీత్యా వచ్చే ఎడిషన్‌లో తాను పాల్గొనలేనంటూ కేకేఆర్ యాజమాన్యానికి సమాచారం అందించాడు. దీంతో నైట్ రైడర్స్ మేనేజ్మెంట్ అతని స్థానాన్ని మరో ఇంగ్లాండ్ ఓపెనర్‌తో భర్తీ చేసింది.
వేలంలో అమ్ముడుపోని సాల్ట్
జాసన్ రాయ్ ఇలా వైదొలగడం ఇదే తొలిసారి కాదు. 2020 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇలానే షాకిచ్చాడు. అనంతరం 2022లో గుజరాత్ టైటాన్స్ నుండి నిరవధిక విరామం తీసుకున్నాడు. రాయ్ స్థానంలో కేకేఆర్ యాజమాన్యం ఫిల్ సాల్ట్‌ను జట్టులోకి తీసుకుంది. గతేడాది సాల్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 9 మ్యాచ్‌ల్లో 163.91 స్ట్రైక్ రేట్ తో 218 పరుగులు చేశాడు. అయితే, అనూహ్యంగా అతడు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. కనీస ధరకు కొనుగోలు చేసేందుకు కూడా ఫ్రాంచైజీలు అతని పట్ల ఆసక్తి చూపలేదు. అతని రిజర్వ్ వేలం ధర రూ. 1.5 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.
Phil Salt has been named as replacement for Jason Roy by KKR for #IPL2024 pic.twitter.com/mPV1WxK2q9
— Cricbuzz (@cricbuzz) March 10, 2024
మార్చి 22 నుంచి ఐపీఎల్
ఈ ఏడాది మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ మొదటి 21 రోజుల షెడ్యూల్ విడుదల చేసింది. మిగిలిన షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల తేదీలను వెల్లడించిన తర్వాత ప్రకటించనుంది.
మొదటి 21-మ్యాచ్‌ల షెడ్యూల్
- మార్చి 22 : చెన్నై వర్సెస్ బెంగళూరు (చెన్నై)
- మార్చి 23 : పంజాబ్ వర్సెస్ ఢిల్లీ (మొహాలీ)
- మార్చి 23: కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ (కోల్‌కతా)
- మార్చి 24 : రాజస్తాన్ వర్సెస్ లక్నో (జైపూర్)
- మార్చి 24 : గుజరాత్ వర్సెస్ ముంబై (అహ్మదాబాద్)
- మార్చి 25 : బెంగళూరు వర్సెస్ పంజాబ్ (బెంగళూరు)
- మార్చి 26 : చెన్నై వర్సెస్ గుజరాత్ (చెన్నై)
- మార్చి 27 : హైదరాబాద్ వర్సెస్ ముంబై (హైదరాబాద్)
- మార్చి 28 : రాజస్తాన్ వర్సెస్ ఢిల్లీ (జైపూర్)
- మార్చి 29 : బెంగళూరు వర్సెస్ కోల్‌కతా (బెంగళూరు)
- మార్చి 30 : లక్నో వర్సెస్ పంజాబ్ (లక్నో)
- మార్చి 31: గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ (అహ్మదాబాద్)
- మార్చి 31 : ఢిల్లీ వర్సెస్ చెన్నై (వైజాగ్)
- ఏప్రిల్ 01 : ముంబై వర్సెస్ రాజస్తాన్ (ముంబై)
- ఏప్రిల్ 02 : బెంగళూరు వర్సెస్ లక్నో (బెంగళూరు)
- ఏప్రిల్ 03 : ఢిల్లీ వర్సెస్ కోల్‌కతా (వైజాగ్)
- ఏప్రిల్ 04 : గుజరాత్ వర్సెస్ పంజాబ్ (అహ్మదాబాద్)
- ఏప్రిల్ 05 : హైదరాబాద్ వర్సెస్ చెన్నై (హైదరాబాద్)
- ఏప్రిల్ 06 : రాజస్తాన్ వర్సెస్ బెంగళూరు ( జైపూర్)
- ఏప్రిల్ 07 : ముంబై వర్సెస్ ఢిల్లీ (ముంబై)
- ఏప్రిల్ 07 : లక్నో వర్సెస్ గుజరాత్ (లక్నో)