రోహిత్ శర్మకు 2024 కలిసిరాలేదు గానీ.. ఇండియన్ బౌలింగ్ సెన్సేషన్ జస్ ప్రీత్ బుమ్రాకు ఈ ఇయర్ బాగా కలిసొచ్చింది. బుమ్రా మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. సర్ గ్యార్ ఫిల్డ్ సోబర్స్ ట్రోఫీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు బుమ్రా నామినేట్ కావడంతో కొత్త ఏడాదికి కొత్త వెల్ కమ్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ అవార్డుతో పాటు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు బుమ్రా నామినేట్ అయినట్లు ఐసీసీ ప్రకటించింది.
బుమ్రా తో పాటు ఇంగ్లండ్ స్టార్ హార్రీ బ్రూక్, జో రూట్, ఆస్ట్రేలియా నుంచి ట్రావిస్ హెడ్ గ్యార్ ఫీల్డ్ అవార్డుకు ఎంపికైన వారిలో ఉన్నారు. వీరిలో బుమ్రా, జో రూట్, బ్రూక్ లు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు. వీరితో పాటు శ్రీలంక నుంచి కమండు మెండిస్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ నామినేషన్స్ కు ఎంపికయ్యాడు.
వండే, టీ20, టెస్ట్.. ఇలా క్రికెట్ ఏదైనా సరే 2024 బుమ్రా ఇయర్ అని చెప్పుకోవచ్చు. కేవలం 13 టెస్టులలో 71 వికెట్లు తీసిన బుమ్రా.. అదే సమయంలో 14.92 యావరేజ్ తో ప్రపంచ క్రికెట్ పెద్దలను వాహ్వా అనిపించాడు. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో 15 వికెట్లు తీసి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. వీటన్నింటికంటే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కేవలం నాలుగు టెస్టులలో 30 వికెట్లు తీసి ప్రస్తుత క్రికెట్ లో తనెందుకు మేటి బౌలరో నిరూపించుకున్నాడు.
ALSO READ | IND vs AUS: కింగ్ చచ్చిపోయాడు.. కోహ్లీ ఔటవ్వడంపై ఆసీస్ మాజీ జుగుప్సాకర వ్యాఖ్యలు
ఇటీవల ఐసీసీ 2024 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ నామినేషన్స్ లిస్టును ఐసీసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇండియా నుంచి అర్ష్ దీప్ సింగ్ నామినేషన్స్ లిస్టులో ఉన్నాడు. టీ20 మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ నామినేషన్స్ లో ఇండియా నుంచి యంగ్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ఉండటంపై క్రికెట్ ఫ్యా్న్స్ ఆనందం వ్యక్తం చేశారు.
అయితే అర్ష్ దీప్ ఎంపికతో పాటు బుమ్రా ను కూడా ఎంపిక చేయాల్సిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణం.. ఫామ్ లో లేని, ఈ ఏడాది అంతగా ప్రభావం చూపని పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ అజమ్ ను ఎంపిక చేసి.. బుమ్రాను నెగ్లెక్ట్ చేయడంపై ఫ్యాన్స్ ఆగ్రం వ్యక్తం చేయడంతోపాటు ఐసీసీపై ట్రోల్స్ కూడా చేశారు.
మొత్తానికి ఇండియా నుంచి బుమ్రా, హర్ష్ దీప్ సింగ్ ఇద్దరు ఐసీసీ అవార్డ్స్ కు నామినేట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. న్యూ ఇయర్ కు ఇంతకు మించిన జోష్ ఏముంటుందని సంబరపడుతున్నారు.