సీమా హైదర్, అంజు.. బాటలో మరో వనిత చేరింది. పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్ పబ్జీలో పరిచయమైన సచిన్ మీనా(నోయిడా) కోసం ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దులు దాటింది. మొదట పాకిస్థాన్ నుండి దుబాయ్ వెళ్లి, అక్కడినుండి నేపాల్ చేరుకొని తన పిల్లలతో సహా భారత్‌లోకి ప్రవేశించింది. ఈ ఘటన అనంతరం రాజస్థాన్, భివాండీ జిల్లాకు చెందిన అంజూ(34) అనే మహిళ భర్త, పిల్లలను వదిలేసి.. ఫేస్‌బుక్‌లో పరిచమైన యువకుడి కోసం పాకిస్థాన్ వెళ్ళింది. అతన్ని కలవడానికి వెళ్లినట్టు చెప్పిన ఆమె.. అక్కడికి వెళ్లాక ఇస్లాం మతాన్ని ఆచరించి ఫాతిమాగా తన పేరు మార్చుకుంది. అనంతరం ప్రియుడిని పెళ్లాడి.. అక్కడే స్థిరపడింది. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఇప్పుడు అదే మార్గాన్ని మరో భారత యువతి అనుసరించింది.
Also Read :పంజాబ్ సీఎం కీలక ప్రకటన .. ఆ రైతు కుటుంబానికి రూ.కోటీ, ప్రభుత్వ ఉద్యోగం
పంజాబ్‌కు చెందిన జస్ప్రీత్ కౌర్ అనే యువతి ఇస్లాం మతంలోకి మారి సియాల్‌కోట్( పాకిస్థాన్)కు చెందిన యువకుడి(అర్సలాన్)ని వివాహం చేసుకుంది. ఏప్రిల్ 15 వరకు చెల్లుబాటయ్యే భారత విజిటింగ్ వీసాపై పాకిస్థాన్ వెళ్లిన జస్ప్రీత్ కౌర్.. అక్కడికి వెళ్లాక ఇస్లాం మతాన్ని స్వీకరించింది. పెళ్ళికి ముందు ఆమె తన పేరును జైనాబ్ గా మార్చుకుంది. అనంతరం ప్రియుడిని పెళ్లాడింది. జస్ప్రీత్ కౌర్ తల్లిదండ్రులు భారతీయులని, వారు జర్మనీలో నివసిస్తున్నారని జామియా హనీఫియా సియాల్‌కోట్ అధికారులు తెలిపారు. జస్‌ప్రీత్‌కు మ్యూనిచ్ నుండి జారీ చేయబడిన భారతీయ పాస్‌పోర్ట్ ఉంది.
A German Sikh girl did nikah with a man from Sialkot after embracing Islam. Jaspreet Kaur, now renamed Zainab, exchanged vows with Ali Arsalan. Kaur is the daughter of Sangara Singh from Ludhiana. pic.twitter.com/idS6JKVhuV
— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) February 22, 2024