
ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో లేదు చూస్తున్న ఐపీఎల్ కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చి 22 నుంచి ఈ మెగా లీగ్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ప్రతి సీజన్ లాగే ఈ సారి ముంబై ఇండియన్స్ టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. తొలి మ్యాచ్ లోనే తమ చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఆదివారం (మార్చి 23) చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సొంతగడ్డ కావడంతో ఈ మ్యాచ్ లో చెన్నై ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. తొలి మ్యాచ్ కు ముందు ముంబై ఇండియన్స్ బలహీనంగా కనిపిస్తుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య, ఫాస్ట్ బౌలర్ బుమ్రా లేకపోవడమే ఇందుకు కారణం.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా వరుసగా మూడు సార్లు స్లో ఓవరేట్‌కు గురయ్యాడు. దీంతో అతను నిషేధానికి గురయ్యాడు. దీని ప్రకారం తొలి మ్యాచ్ కు హార్దిక్ పాండ్య అందుబాటులో లేకపోవడంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ జట్టును నడిపించడం దాదాపు ఖాయమైంది. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. బుమ్రా తొలి మ్యాచ్ తో పాటు ఆ తర్వాత జరగబోయే నాలుగు మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం లేదు.
బుమ్రా, పాండ్య దూరం కావడంతో ముంబై బౌలింగ్ బలహీనంగా మారింది. ఇక ముంబై ఫినిషర్ గా జట్టులో ఎవరు లేరు. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ మిడిల్ ఆర్డర్ లో అనుభవం లేని ఆటగాళ్లు ఉండడం ఆ జట్టుకు మైనస్. స్పిన్ భారాన్ని సాంట్నర్ ఒక్కడే మోయనున్నాడు. బౌల్ట్ ఫామ్ లో ఉన్నా.. దీపక్ చాహర్ ఎలా బౌలింగ్ చేస్తాడో ఒక అంచనాకు రావడం కష్టం. మరోవైపు చెన్నై పూర్తి స్థాయి జట్టుతో బలహీనంగా కనిపిస్తుంది.
తొలి మ్యాచ్ కు ముంబై ఇండియన్స్ జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రాజ్ అంగద్ బావా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, అర్జున్ టెండూల్కర్, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్.