
ఐపీఎల్ లో ఆదివారం (ఏప్రిల్ 13) ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కరుణ్ నాయర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పవర్‌ప్లే చివరి ఓవర్‌లో బుమ్రాను నాయర్ చితక్కొట్టాడు. రెండు సిక్సులు, ఒక ఫోర్ తో ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్ లో పరుగు తీస్తుండగా కరుణ్ అనుకోకుండా బుమ్రాను ఢీకొన్నాడు. ఇది కాస్త గొడవకు కారణమైంది. కరుణ్ క్షమాపణలు చెప్పినా బుమ్రా మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు.
కరుణ్ నాయర్ ను ఏదో అంటూ కనిపించాడు. బుమ్రాపై నాయర్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. ఇంతలో హార్దిక్ పాండ్య వచ్చి ఇద్దరిని గొడవ తగ్గించే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయాన్ని చాలా సిల్లీగా తీసుకున్నట్టు కనిపించాడు. గొడవ జరుగుతుంటే నవ్వుతూ విచిత్రమైన రియాక్షన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
Also Read : ఢిల్లీ కొంప ముంచిన రనౌట్స్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ముంబై
Bumrah is showing unwanted agression on Karun Nair pic.twitter.com/lwDD0qvYiC
— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) April 13, 2025
ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది.