బుమ్రాకే ఐసీసీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆఫ్‌‌‌‌‌‌‌‌ ది ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు

బుమ్రాకే ఐసీసీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆఫ్‌‌‌‌‌‌‌‌ ది ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు
  • 2024 ఐసీసీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆఫ్‌‌‌‌‌‌‌‌ ది ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు సొంతం
  • ఈ ఘనత సాధించినఇండియా తొలి పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డు

దుబాయ్‌‌‌‌‌‌‌‌: ఫార్మాట్ ఏదైనా.. తన పేస్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌తో ప్రత్యర్థులను గడగడలాడిస్తున్న టీమిండియా స్టార్ పేసర్ జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా 2024 ఏడాదికి గాను ఐసీసీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్​ ది ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్ గ్యార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ సోబర్స్‌‌‌‌‌‌‌‌ అవార్డుకు  బుమ్రాను ఎంపిక చేసినట్టు ఐసీసీ మంగళవారం ప్రకటించింది. దాంతో ఇండియా నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డుకెక్కాడు. 

ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇది వరకు లెజెండరీ ప్లేయర్లు రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ టెండూల్కర్ (‌‌‌‌‌‌‌‌2010), అశ్విన్ (216), విరాట్ కోహ్లీ (2017, 2018) ఈ పురస్కారం అందుకున్నారు.  గతేడాది బుమ్రా బరిలోకి దిగిన ప్రతీ చోటా అదరగొట్టాడు. అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో 15 వికెట్లు పడగొట్టి ఇండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్​ ద టోర్నీ అవార్డు కూడా అందుకున్నాడు.  అలాగే, వేగంగా 200 టెస్టు వికెట్లు సాధించిన ఇండియా పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. గతేడాది 13 టెస్టుల్లో ఆడిన  బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు.    తనకు లభించిన ఈ గౌరవంతో చాలా సంతోషంగా ఉన్నానని బుమ్రా చెప్పాడు. అయితే పురస్కారంతో తాను పొంగిపోవడం లేదని, తన కాళ్లు నేలపైనే ఉంటాయని ఓ వీడియో సందేశంలో
 పేర్కొన్నాడు.