న్యూఢిల్లీ : స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అంశంపై కొద్దిగా క్లారిటీ వచ్చింది. ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు బుమ్రాకు రెస్ట్ ఇచ్చి డైరెక్ట్‌గా చాంపియన్స్‌లో ఆడించేలా సెలెక్టర్లు ప్లాన్స్ చేస్తున్నారు. దీంతో ఈ నెల 12 వరకు ఐసీసీకి సమర్పించే జట్టులో బుమ్రా పేరు ఉండటం దాదాపుగా ఖాయమైంది. ఒకవేళ గాయం తీవ్రత పెరిగి ఆడే పరిస్థితి లేకపోతే అప్పుడు అతనిపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. అయితే బౌలింగ్ వేసేటప్పుడు ఎలాంటి నొప్పి లేకుంటేనే చాంపియన్స్‌లో బరిలోకి దిగాలని బుమ్రా భావిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇప్పటికే తన వెన్నుకు ఆపరేషన్ చేసిన న్యూజిలాండ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోవాన్ షౌటెన్‌ను సంప్రదించాడని తెలుస్తోంది. గాయం తీవ్రతపై ఓ అంచనాకు వచ్చిన తర్వాత షౌటెన్ ఓ నివేదికను బీసీసీఐకి అందజేయనున్నాడు. చికిత్సకు సంబంధించిన అంశాలను కూడా ఇందులో పొందుపర్చనున్నాడు. కేఎల్ రాహుల్‌కు కూడా ఇంగ్లండ్‌తో సిరీస్‌లకు రెస్ట్ ఇచ్చే చాన్స్ ఉంది.
దీనికి బదులుగా చాంపియన్స్ ట్రోఫీలో కీపర్‌గా తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇక విజయ్ హజారే ట్రోఫీలో మెరిసిన మహ్మద్ షమీపై కూడా సెలెక్టర్లు ఓ నిర్ణయానికి రానున్నారు. అతని గాయంపై కూడా ఎన్‌సీఏ నుంచి నివేదిక తీసుకోనున్నట్లు తెలుస్తోంది.