Jasprit Bumrah: ఫామ్‌లో ఉన్నా టీమిండియా కెప్టెన్‍గా బుమ్రాకు నో ఛాన్స్.. కారణం ఇదే!

ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోవడంతో ప్రస్తుతం టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కెప్టెన్సీ సంగతి పక్కన పెడితే హిట్ మ్యాన్ బ్యాటింగ్ లోనూ విఫలం కావడం అతని కెరీర్ ను ప్రమాదంలో పడేసింది. ఆస్ట్రేలియా సిరీస్ కు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లోనూ భారత్ 0-3 తేడాతో ఓడిపోవడం రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోలేకపోయిన భారత్ 2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ లో సత్తా చాటాలని చూస్తుంది. 

2025 డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్దపై భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ కు రోహిత్ శర్మ ఆడడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ ఇంగ్లాండ్ సిరీస్ కు సెలక్ట్ కాకపోతే అతని స్థానంలో బుమ్రా టెస్ట్ చేయడం ఖాయం. అయితే భారత క్రికెట్ జట్టుకు బుమ్రా దీర్ఘకాలిక కెప్టెన్ గా బుమ్రాను పరిగణించే అవకాశాలు లేవంటున్నారు సెలక్టర్లు. దానికి కారణం బుమ్రా తరచూ గాయాలపాలవ్వడమే.

Also Read :- ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
 
బుమ్రా తన కెరీర్ ప్రారంభం నుంచి గాయాలతో ఇబ్బందిపడుతున్నాడు. ఈ టీమిండియా ఫాస్ట్ బౌలర్ కు గాయమైతే కోలుకోవడానికి  కొన్నిసార్లు 6 నెలలు లేదా 12 నెలలు సమయం పడుతుంది. అదే జరిగితే జట్టును నడిపించడానికి మరొకరిని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సెలక్టర్లు టెస్ట్ కెప్టెన్ గా బుమ్రా పరిగణించట్లేదట. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కెప్టెన్సీ రేస్ యూలో ఉన్నారు. ప్రస్తుతం వెన్ను గాయంతో ఇబ్బందిపడుతున్న బుమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేది అనుమానంగా మారింది.