Jasprit Bumrah: బుమ్రాకు బెడ్ రెస్ట్.. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌కు డౌట్

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై అప్ డేట్ వచ్చింది. వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రాకు డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి నెల మాత్రమే సమయం ఉండడంతో భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. ఈ మెగా టోర్నీకి బుమ్రా దాదాపు దూరమవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం అయ్యే అవకాశాలు లేకపోలేదు. 

బుమ్రా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతనికి వీపు వెనుక భాగంలో వాపు కారణంగా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో బుమ్రాను వెన్ను గాయం బాధించింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయడానికి రాలేదు.ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరమైతే భారత్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టే. అతన్ని రీప్లేస్ చేసే ఆటగాళ్లు ఎవరూ లేకపోవడమే ఇందుకు కారణం. 

ALSO READ | IND vs IRE: పసికూనపై ప్రతాపం: ఐర్లాండ్‌పై టీమిండియా మహిళలు రికార్డుల వర్షం

మంగళవారం (జనవరి 14) బుమ్రా.. ‘ఐసీసీ మెన్స్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్‌‌‌‌ ఆఫ్ డిసెంబర్‌‌‌‌’ అవార్డు గెలుచుకున్నాడు. డిసెంబర్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు ఈ టీమిండియా ఫాస్ట్ బౌలర్ కు ఐసీసీ అవార్డు వరించింది. ఈ అవార్డుకు బుమ్రా తో పాటు ఆసీస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ ప్యాట్‌‌‌‌ కమిన్స్‌‌‌‌, సౌతాఫ్రికా సీమర్‌‌‌‌ డ్వేన్‌‌‌‌ పీటర్సన్‌‌‌‌ కూడా నామినేట్ అయ్యారు. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో బుమ్రా 14.22 యావరేజ్‌‌‌‌తో 22 వికెట్లు తీశాడు.