Jasprit Bumrah: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు రిస్క్ అవసరమా.. ఐపీఎల్ ఫస్ట్ హాఫ్‌కు బుమ్రా ఔట్!

Jasprit Bumrah: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు రిస్క్ అవసరమా.. ఐపీఎల్ ఫస్ట్ హాఫ్‌కు బుమ్రా ఔట్!

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన ఈ టీమిండియా పేసర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని సమాచారం. బుమ్రా క్రికెట్‌లోకి తిరిగి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చని అర్ధమవుతుంది. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. ముంబై ఇండియన్స్ ఆడబోయే తొలి మూడు లేదా నాలుగు మ్యాచ్ లకు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. 

నడుము గాయం కారణంగా ప్రస్తుతం క్రికెట్ కు దూరంగా ఉంటున్న బుమ్రా ఏప్రిల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరనున్నట్టు బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం. జూన్ నెలలో ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐపీఎల్ తర్వాత రెండు వారాల్లో ఇంగ్లాండ్ కు భారత్ పయనం కావాల్సి ఉంది. టెస్ట్ ఛాంపియన్స్ షిప్ లో కీలకంగా మారిన ఈ సిరీస్ లో బుమ్రా ఆడడం చాలా కీలకం. ఈ సుదీర్ఘ సిరీస్ కు బుమ్రా తాజాగా ఉండాలంటే అతనికి మరింత రెస్ట్ బీసీసీఐ భావిస్తోందట. పైగా ఈ సిరీస్ కు రోహిత్ స్థానంలో టెస్ట్ కెప్టెన్ గా బుమ్రాను ఎంపిక చేయడం దాదాపుగా ఖరారైంది. అదే జరిగితే బుమ్రా ఫస్ట్ హాఫ్ ఐపీఎల్ మ్యాచ్ లకు దూరమైనా ఆశ్చర్యం లేదు.

బుమ్రా 2025 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు రూ.18 కోట్ల రూపాయలతో ఈ టీమిండియా పేసర్ ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది. బుమ్రా లేకపోవడం ముంబైకి అతి పెద్ద మైనస్ కానుంది. బుమ్రా లేకపోయినా ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్ లతో ముంబై పటిష్టంగానే కనిపిస్తుంది. ఇప్పటివరకు 133 మ్యాచ్ ల్లో 7.3 ఎకనామితో బుమ్రా 165 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు 5 వికెట్లు ఘనత అందుకున్నాడు.