వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు సాధారణ స్కోర్ కే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి 240 పరుగులకు ఆలౌటైంది. రాహుల్(66), కోహ్లీ(54) అర్ధ సెంచరీలు చేసి రాణించారు. రోహిత్ శర్మ 47 పరుగులు చేసాడు. ఎన్నో అంచనాల మధ్య టీమిండియా బ్యాటింగ్ 240 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. ఈ మ్యాచ్ పై ఆశలు వదిలేసుకున్నారు.
అహ్మదాబాద్ పిచ్ స్లో గా ఉంది కాబట్టి ఈ మ్యాచ్ లో టీమిండియా పోరాడితే విజయం సాధించవచ్చు. 241 పరుగుల లక్ష్యం అంటే బౌలర్లు సమిష్టిగా రాణిస్తే కంగారూల జట్టును చిత్తు చేయవచ్చు. ముఖ్యంగా పవర్ ప్లే లో భారత బౌలర్లు బుమ్రా, షమీ, సిరాజ్ రాణిస్తే భారత్ కు తిరుగుండదు. తొలి 10 ఓవర్లలో మన పేసర్లు మంచి ఆరంభం ఇస్తే కుల్దీప్, జడేజా ఆస్టేలియాను కట్టడి చేసి విశ్వ విజేతగా నిలిచే అవకావడం ఉంది. మొత్తానికి మన బౌలర్లు ఎలా రాణిస్తారు అనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.