IND vs ENG: యార్కర్లు వేయడంలో పాకిస్థాన్ దిగ్గజ పేసర్లే స్ఫూర్తి: జస్ప్రీత్ బుమ్రా 

IND vs ENG: యార్కర్లు వేయడంలో పాకిస్థాన్ దిగ్గజ పేసర్లే స్ఫూర్తి: జస్ప్రీత్ బుమ్రా 

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా యార్కర్లు వేయడంలో దిట్ట అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బౌన్స్, స్వింగ్, స్లో బంతులు  వేసి ఫలితం రాబట్టినా.. యార్కర్లే బుమ్రా ప్రధాన బలం. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో బుమ్రా సంధించిన యార్కర్లు చూస్తుంటే ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో ఈ స్టార్ పేసర్ లా యార్కర్లవేసే వీరుడు మరొకరు లేరనే చెప్పవచ్చు. స్టార్ బ్యాటర్లు సైతం బుమ్రా పదునైన యార్కర్లకు బలవ్వాల్సిందే. ఈ సిరీస్ లో పోప్, స్టోక్స్ కు వేసిన యార్కర్లు క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
  
బుమ్రా తాజాగా తన యార్కర్ల గురించి మాట్లాడుతూ.. పాక్ దిగ్గజ పేస్ బౌలర్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్ ఖాన్ అని తెలిపాడు. ఈ లిస్టులో మాజీ ఇండియన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ కూడా ఉన్నాడు. వైజాగ్ టెస్టు గెలిచిన తర్వాత బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మ్యాచ్ తర్వాత తన యార్కర్ల రహస్యం గురించి చెప్పుకొచ్చాడు. యార్కర్ నేను నేర్చుకున్న మొదటి డెలివరీ. టెన్నిస్ బాల్‌తో ఆడుతున్నప్పుడు నేను దానిని నేర్చుకున్నాను. టీవీలో వకార్ యూనిస్ ఖాన్, వసీమ్ అక్రమ్, జహీర్ ఖాన్ లను చూసి యార్కర్లను ఎలా ఎగ్జిక్యూట్ చేశారో చూసి నేర్చుకున్నాను. అని మ్యాచ్ అనంతరం బుమ్రా చెప్పాడు.

నెంబర్ల గురించి ఆలోచించనని.. అలా చేస్తే తనపై ఒత్తిడి ఉంటదని అన్నాడు. చిన్న తనంలో ఇలాంటివి చేస్తే ఆనందం వేస్తుంది కానీ ఇప్పుడు అలా లేదన్నాడు. హైదరాబాద్ టెస్టులో రెండు ఇనింగ్స్ లో 5 వికెట్లు తీసుకున్న బుమ్రా..వైజాగ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 6, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసుకున్నాడు. రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ లో బుమ్రా 14 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా బౌలింగ్ తో టీమిండియా వైజాగ్ టెస్టులో 106 పరుగుల తేడాతో విజయం సాధించింది.