పెర్త్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఒకదశలో ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లో మన ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకున్నారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులజు ఆలౌట్ అయినా మన వాళ్ళు కంబ్యాక్ అత్యద్భుతం. ఆతిధ్య ఆస్ట్రేలియాపై అద్భుతంగా ఆడుతూ ఓడిపోయే మ్యాచ్ లో గెలిచారు. 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాను 238 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 295 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకోవడం విశేషం.
ఈ మ్యాచ్ లో మరో సంతోషకర విషయం ఏంటంటే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ సెంచరీ బాదాడు. ఇటీవలే ఫామ్ లేదని విమర్శల పాలవుతున్న కోహ్లీకి ఈ సెంచరీ ఎంతో ప్రత్యేకం. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. కోహ్లీ అనుభవాన్ని ప్రశంసిస్తూ.. అతన్ని విమర్శించే వారికి కౌంటర్ ఇచ్చాడు.
“విరాట్ కోహ్లీకి మాతో అవసరం లేదు. కానీ మాకు మాత్రం అతను కావాలి. జట్టులో అతను అనుభవజ్ఞుడైన ఆటగాడు. ఇది అతనికి ఆస్ట్రేలియాలో ఐదో పర్యటన. అతని క్రికెట్ గురించి అందరికంటే ఎక్కువగా అతనికి తెలుసు. అతను ఎప్పుడూ క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ప్రతి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడం ఎవరికైనా కష్టమే. కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు". అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హేజల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా భారత పేసర్ల ధాటికి 104 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా గా వికెట్లతో కంగారుల పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. జైస్వాల్ (161) కోహ్లీ (100) సెంచరీలతో చెలరేగారు. 534పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 237 పరుగులకే ఆలౌటైంది.
"Virat Kohli doesn’t need us, we need Virat Kohli"- Jasprit Bumrah pic.twitter.com/cLFKPBXLOO
— soo washed (@anubhav__tweets) November 25, 2024